News March 20, 2025
KMR: పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి నెలలో జరిగిన పీజీ ప్రథమ సంవత్సర(రెగ్యులర్) ఫలితాలను తెలంగాణ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రో.సంపత్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ కె. విజయ్ కుమార్ విడుదల చేశారు. ఈ పరీక్షలలో 75 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.కిష్టయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో TU అడిషనల్ కంట్రోలర్ సంపత్ అధికారులు ఉన్నారు.
Similar News
News March 28, 2025
పంచాంగం ఆవిష్కరించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేతుల 2025 ఉగాది పంచాంగన్ని శుక్రవారం ఆయన ఛాంబర్లో ఆవిష్కరించారు. జిల్లా ధూప దీపం నైవేద్యం అర్చకులు రాచర్ల పార్థసారథి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఉపాధ్యక్షులు బీటుకూరి గోపాలాచార్యులు, ప్రధాన కార్యదర్శి రమేష్, గౌరవాధ్యక్షులు, మరిగంటి కొండమాచార్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్, గొంగళ్ళ రవికుమార్, అర్చక బృందం పాల్గొన్నారు.
News March 28, 2025
HYDలో 50 మంది GOVT అధికారుల తొలగింపు..!

పదవీ విరమణ పొందినా చాలా మంది ఇంకా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిక్, రీ అపాయింట్మెంట్ పేరిట ఇంకా ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ఇలాంటివారు జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 50 మంది ఉన్నట్లు తేలింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. దీంతో 50 మంది వరకు మార్చి 31న ఇంటిముఖం పట్టనున్నారు. అడిషనల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ఇంకా కిందిస్థాయి సిబ్బంది వీరిలో ఉన్నారు.
News March 28, 2025
సిరిసిల్ల జిల్లాలో 14 మంది విద్యార్థులు గైర్హాజర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం జరిగిన పదోతరగతి పరీక్షలకు 14 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు తెలిపారు. జిల్లాలో మొత్తం 35 పరీక్ష కేంద్రాల్లో 6,767 మంది విద్యార్థులకు 6,750 విద్యార్థులు పరీక్ష రాశారు. 14 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాలేదని తెలిపారు.