News March 20, 2025

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో బేబినాయన భేటీ

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన గురువారం భేటీ అయ్యారు. అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను విన్నవించారు. బాడంగి మండలం గొల్లాదిలో వేగవతి నదిపై వంతెన ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పామని వంతెన నిర్మాణానికి సహకరించాలని కోరారు. వంతెన నిర్మాణం పూర్తయితే నిర్మాణం వలన బాడంగి, రాజాం, దత్తిరాజేరు, మెరకముడిదాం గ్రామాల ప్రజలకు  ఉపయోగపడుతుందన్నారు.

Similar News

News May 8, 2025

ప్రేమ పేరుతో మోసగించిన వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్ష: SP

image

బొబ్బిలి పోలీస్ స్టేషన్‌లో 2022లో నమోదైన మహిళను మోసం చేసిన కేసులో సీతయ్యపేట వాసి దివనాపు అఖిల్ అంబేత్కర్‌కు పదేళ్ల జైలు శిక్ష, రూ.15వేల జరిమానాను కోర్టు విధించిందని SP వకుల్ జిందల్ గురువారం తెలిపారు. నిందితుడు పాచిపెంటకు చెందిన మహిళను ప్రేమిస్తున్నానని నమ్మించి,శారీరకంగా అనుభవించి మోసం చేశాడనే ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టామన్నారు. ఆధారాలతో కోర్టులో ప్రవేశపెట్టగా నిందితుడికి శిక్ష ఖరారు అయిందన్నారు.

News May 8, 2025

VZM: పతకాలు సాధించిన పోలీసులకు ఎస్పీ అభినందన

image

ఇటీవల కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో నిర్వహించిన జాతీయస్థాయి డెడ్ లిఫ్ట్ & బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో వన్ టౌన్ ASI త్రినాథ్, విశ్రాంత HC శంకర్రావు పతకాలు సాధించారు. వారు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP వకుల్ జిందల్‌ను కలిశారు. ఎస్పీ వాళ్ల ప్రతిభను అభినందించి క్రీడాస్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. 4 బంగారు పతకాలు, 4 వెండి పతకాలు సాధించడం అభినందనీయమన్నారు.

News May 7, 2025

ఎండ తీవ్రత లేని సమయంలో పనులు నిర్వహించాలి: కలెక్టర్

image

ఉపాధి వేతనదారులకు దినసరి వేతనం పెరిగేలా పనులు చేయించాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధి పనుల తీరు, వేతనదారులు అందుకుంటున్న సగటు వేతనంపై సమీక్షించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎండ తీవ్రత లేని సమయంలో పనులు నిర్వహించాలని చెప్పారు. ఉదయాన్నే వీలైనంత వేగంగా పని మొదలయ్యేలా చూడాలన్నారు. రెండుపూటలా కనీసం 6 గంటలు పనులు చేయించాలని ఆదేశించారు.