News March 20, 2025
మేం ఆదేశిస్తే పోలీసులు కేటీఆర్‌ను వంగబెట్టి దంచరా?: సీఎం రేవంత్

TG: తనకు పరిపాలనపై పట్టు రాలేదని BRS చేస్తున్న విమర్శలపై CM రేవంత్ మండిపడ్డారు. ‘వ్యవస్థ అంతా గత ప్రభుత్వం నాటిదే ఉంది కదా. ఆనాడు కోదండరామ్ తలుపులు బద్దలుకొట్టిన అదే పోలీసులు ఈరోజు నేను ఆదేశిస్తే KTR తలుపులు పగులకొట్టి వంగబెట్టి దంచరా? కానీ నేను అలాంటి విధానానికి వ్యతిరేకం. సచివాలయానికే రాని మీకు పట్టు ఉందా? రోజుకు 18 గంటలపాటు పనిచేస్తున్న నాకు, మా సీతక్కకు పరిపాలనపై పట్టు లేదా?’ అని ప్రశ్నించారు.
Similar News
News March 28, 2025
ఆసుపత్రిలో చేరిన కింగ్ ఛార్లెస్-3

బ్రిటన్ కింగ్ ఛార్లెస్-3 ఆసుపత్రిలో చేరారు. 76ఏళ్ల ఆయన కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అందుకు చికిత్స తీసుకుంటుండగా వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్‌తో హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం కింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని లండన్‌లోని బకింగ్‌హమ్ ప్యాలెస్ ప్రకటన విడుదల చేసింది. 2022లో తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత బ్రిటన్ కింగ్‌గా అవతరించిన ఛార్లెస్‌కు 2024 ఫిబ్రవరిలో క్యాన్సర్ నిర్ధారణ అయింది.
News March 28, 2025
సెలవు రోజుల్లోనూ పని చేయనున్న కార్యాలయాలు

దేశవ్యాప్తంగా ఈనెల 29, 30, 31 తేదీల్లో ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఆఫీసులు పనిచేయనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈనెల 31తో ముగియనుండగా, ఆలోగా పన్ను చెల్లింపుదారులు పెండింగ్‌లో ఉన్న తమ ట్యాక్స్ ట్రాన్సాక్షన్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సెలవులున్నప్పటికీ కార్యాలయాలు పని చేస్తాయని CBDT తెలిపింది. అటు ఏపీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలూ 30, 31 తేదీల్లో పనిచేయనున్నాయి.
News March 28, 2025
IPL: నేడు కింగ్స్‌తో ఛాలెంజర్స్ ఢీ

IPL-2025లో భాగంగా ఇవాళ రా.7.30 గంటలకు చెన్నై వేదికగా CSK, RCB మధ్య మ్యాచ్ జరగనుంది. స్పిన్నర్లకు సహకరించే ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాల్లేవు. ఈ సీజన్‌లో ఇరు జట్లు తమ తొలి మ్యాచ్ విజయంతో శుభారంభం చేశాయి. స్పిన్నర్ నూర్ అహ్మద్ నుంచి RCB బ్యాటర్లకు ముప్పు పొంచి ఉంది. RCB పేసర్ భువనేశ్వర్ నేటి మ్యాచులో బరిలోకి దిగుతారని సమాచారం. ఇందులో ఏ జట్టుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు? COMMENT