News March 20, 2025
మంచిర్యాల జిల్లాలో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

మంచిర్యాల జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. వచ్చే నాలుగు రోజుల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలు ఉపశమనం పొందనున్నారు. కానీ పంటలకు నష్టం జరిగే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News December 8, 2025
ధాన్యం విక్రయించే రైతులకు గోనె సంచులు ఉచితం: కలెక్టర్

ధాన్యం విక్రయించే రైతులకు గోనె సంచులు ఉచితంగా ఇవ్వాలని, గోనె సంచులు తెచ్చుకున్న వారికి అధికారులే నగదు చెల్లించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందితో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. ధాన్యం విక్రయించడానికి రైతులే స్వయంగా గోనె సంచులు తెచ్చుకుంటే ప్రభుత్వం నగదు చెల్లిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
News December 8, 2025
సంగారెడ్డి: ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినిగించుకోవాలి: కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య సోమవారం తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఫెసిలిటీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొదటి విడత ఎన్నికలు జరిగే సంగారెడ్డి, కంది, సదాశివపేట, గుమ్మడిదల, కొండాపూర్, పటాన్ చెరు, హత్నూర ఎంపీడీవో కార్యాలయాల్లో ఈనెల 9లోపు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని చెప్పారు.
News December 8, 2025
బాపట్ల PGRSకు 65 అర్జీలు: DSP

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు సీసీఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్ PGRS నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 65 అర్జీలు అందినట్లు తెలిపారు. ఫిర్యాదులను చట్ట పరిధిలో వేగంగా పరిష్కరించాలని డీఎస్పీ సూచించారు. ప్రతి సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని ఎస్పీ తెలిపారు.


