News March 20, 2025
టెన్త్ పరీక్షలు.. జిరాక్స్ సెంటర్ల బంద్ చేయాలి: వరంగల్ సీపీ

పదో తరగతి పరీక్షల సందర్భంగా పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో పరీక్ష కేంద్రాల సమీపంలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉండవద్దని సీపీ సన్ ప్రీత్ సింగ్ అదేశించారు. ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్ల వద్ద ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా జాగ్రత్త పడాలన్నారు. ముఖ్యంగా పరీక్ష కేంద్ర పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News March 28, 2025
కుప్పకూలిన 1000 పడకల ఆసుపత్రి.. భారీగా క్షతగాత్రులు

భూకంప తీవ్రతకు మయన్మార్ రాజధాని నేపిడాలో 1,000 పడకల ఆసుపత్రి కుప్పకూలింది. ఇందులో పెద్ద ఎత్తున క్షతగాత్రులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మండలే నగరంలో ఒక వంతెన కూలిపోయింది. పలు చోట్ల ఎత్తైన భవనాలు, గుళ్లు నేలకొరిగాయి. ఇప్పటి వరకూ 55మంది మృతి చెందినట్లు అధికారులు తెలుపగా సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. బ్యాంకాక్‌లో భారీ భవనం కూలడంతో ముగ్గురు మృతి చెందగా పదుల సంఖ్యలో శిథిలాల కింద చిక్కుకున్నారు.
News March 28, 2025
1న ఉదయం 7 గంటలకే సామాజిక పింఛన్లు పంపిణీ ప్రారంభం

జిల్లా పరిధిలో ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం మే 1న ఉదయం ఏడు గంటలకే ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లాలో 2,61,841 మంది లబ్ధిదారులు ఉండగా వారికి రూ.111.82 కోట్లు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి లబ్ధిదారులకు నగదు అందజేస్తారన్నారు. ఆరోజు పింఛన్ పొందే ప్రతి ఒక్కరు ఇంటి వద్ద ఉండి నగదు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
News March 28, 2025
రూ.లక్ష లంచం తీసుకుంటూ దొరికిన జిల్లా రిజిస్ట్రార్

AP: కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు, అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తన భార్య పేరిట ఉన్న గ్యాస్ ఏజెన్సీని తన పేరు మీదకు మార్చాలంటూ తునికి చెందిన రమేశ్‌బాబు రిజిస్ట్రార్‌ను ఆశ్రయించారు. ఇందుకు ఆయన రూ.లక్ష డిమాండ్ చేయడంతో రమేశ్ ఏసీబీకి సమాచారమిచ్చారు. దీంతో నిఘా వేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.