News March 20, 2025
మెదక్: రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

శుక్రవారం మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం అయినప్పటికీ.. పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News November 2, 2025
మెదక్‌లో మూడు చారిత్రక శాసనాలు

మెదక్ పట్టణ నడిబొడ్డున మూడు చారిత్రక విలువైన శాసనాలు అందుబాటులో ఉన్నాయని ఔత్సాహిక చారిత్రక పరిశోధకుడు బుర్ర సంతోష్ తెలిపారు. గిద్దెకట్ట చెరువు ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న ఒక శాసనం మట్టిలో కలిసి పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దానిని భూమిలోంచి తీసి పరిరక్షించి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మరొక శాసనం నవాబ్‌పేటలో ఖిల్లా వెనుక నల్లరాతిపై చెక్కించినట్లు సంతోష్ పేర్కొన్నారు.
News November 2, 2025
మెదక్: 3న విద్యుత్ సమస్యలు చెప్పుకోండి: ఎస్ఈ

మెదక్ జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ఈనెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం (కన్సూమర్స్ డే) నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ నారాయణ నాయక్ తెలిపారు. మెదక్ జిల్లాలో రైతులు, గృహావసర విద్యుత్ వినియోగదారులకు ధీర్ఘకాలికంగా విద్యుత్ సమస్యలు ఏమైనా ఉన్నా, మీటర్లు, అధిక బిల్లులు వచ్చినా, రైతులకు ట్రాన్స్ఫార్మర్లకు కానీ, విద్యుత్ వైర్లకు సంబంధించి నేరుగా వచ్చి చెప్పాలని కోరారు.
News November 1, 2025
నర్సాపూర్: ‘ఎకో పార్కు, చెరువు డంపింగ్ యార్డ్ కావద్దు’

నర్సాపూర్ శివారులో నిర్మించిన నూతన ఎకో పార్కు చెరువు డంపింగ్ యార్డ్ కావద్దని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. నర్సాపూర్ శివారులో నూతనంగా నిర్మించిన ఎకో పార్కును మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్‌లతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నర్సాపూర్ అర్బన్ ఎకో పార్కు తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుందన్నారు. ఆయా శాఖల అధికారులు నాయకులు పాల్గొన్నారు.


