News March 20, 2025
ఏలూరు: సత్తా చాటిన ఆశ్రమం మెడికల్ కాలేజ్ విద్యార్థులు

ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజి విద్యార్థులు 2024 సంవత్సరానికి జరిగిన యంబీబీయస్ పరీక్షా ఫలితాలలో అఖండ విజయాన్ని నమోదు చేశారు. 257 మంది విద్యార్ధులు పాల్గొన్న ఈ పరీక్షలలో 238 విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఆశ్రం వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా.చేబ్రోలు శ్రీనివాస్ తెలిపారు. ఫైనల్ యం.బి.బి.యస్ పార్ట్-1 లో 100% శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, పార్ట్-2లో 92% శాతం ఉత్తీర్ణత నమోదు చేశారన్నారు.
Similar News
News January 4, 2026
మీకోసం వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చు: కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి

పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించాలన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో ప్రతిరోజూ వినతులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు మీకోసం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలను 1100కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అన్నారు.
News January 4, 2026
సింగరేణి నెగ్లిజెన్సీ.. విలువైన సంపద మాయం

అక్రమ దందాలు, చోరీలతో సింగరేణి ప్రతిష్ఠ మసకబారుతోంది. సింగరేణిలో భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు, స్టోర్ యార్డులు, స్క్రాప్ డిపోలలో చోరీలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ప్రొడక్షన్ టైంలో తక్కువ బరువు చూపించి రాత్రివేళలో అదనపు బొగ్గు లోడ్లు తరలిస్తూ అక్రమ దందాకు పాల్పడుతున్నారట. విలువైన సింగరేణి సంపద చోరీకి గురవుతున్న సెక్యూరిటీ చేతులెత్తేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
News January 4, 2026
ప.గో: అక్క అనే పిలుపునకు అండగా నిలిచి.. తలకొరివి పెట్టి మానవత్వం చాటి..

రక్త సంబంధం లేకపోయినా చిన్న పిలుపుతో ఏర్పడిన అనుబంధం మానవత్వాన్ని చాటింది. బ్రాడీపేటకు చెందిన కొరటాని శ్రీను(45) శనివారం అనారోగ్యంతో మృతి చెందగా, బంధువులు ఎవరూ రాలేదు. దీంతో శ్రీను ‘అక్క’ అని పిలిచే పొరుగున ఉన్న పతివాడ మావూళ్లమ్మ చలించిపోయింది. తానే స్వయంగా తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ఆమె చూపిన ఈ చొరవను చూసి స్థానికులు కంటతడి పెట్టుకుంటూ, మావూళ్లమ్మ పెద్దమనసును అభినందించారు.


