News March 24, 2024
విజయనగరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

బొండపల్లి మండలంలోని గ్రహపతి అగ్రహారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు బొండపల్లి ఎస్.ఐ కె.లక్ష్మణరావు ఆదివారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. గ్రామానికి చెందిన నమ్మి గౌరి నాయుడు బహిర్భూమికి రోడ్డుపై రాగా రెల్లిపేటకు చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తూ ఢీకొట్టాడు. 108 వాహనం వచ్చేసరికి గౌరినాయుడు మృతి చెందినట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News March 14, 2026
గ్యాస్ సిలెండర్లపై అసత్య ప్రచారం నమ్మవద్దు: JC

జిల్లాలో గ్యాస్ కొరత ఉందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని JC సేధు మాధవన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి, పట్టణాల్లో 25 రోజులకు ఒకసారి మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలని చెప్పారు. అక్రమంగా సిలిండర్లు నిల్వ చేసిన ఘటనల్లో 16 సిలిండర్లను స్వాధీనం చేసుకుని సంబంధితులపై కేసులు నమోదు చేశామన్నారు. గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు.
News March 13, 2026
రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించాలి: VZM SP

జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో రేపు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ పోలీసు అధికారులను శుక్రవారం ఆదేశించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించి ఇరు వర్గాలతో చర్చలు జరిపి పరిష్కారం చేయాలని సూచించారు. ఇందుకోసం పోలీస్ స్టేషన్ల స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని తెలిపారు.
News March 13, 2026
విజయనగరంలో జోయాలుక్కాస్ గ్రాండ్ ఓపెనింగ్

విజయనగరంలో జోయాలుక్కాస్ జువెలరీ షోరూమ్‌ను స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. వినియోగదారులు ఈ షోరూమ్‌లో ఒకే చోట బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు, ప్లాటినం, వివాహ ఆభరణాలు పొందవచ్చని ఆమె పేర్కొన్నారు. మార్చి 29 వరకు తయారీ ఛార్జీలపై ఫ్లాట్ 40% ప్రారంభ ఆఫర్‌ను అందిస్తున్నట్లు గ్రూప్ ఛైర్మన్&మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జోయ్ అలుక్కాస్ తెలిపారు.


