News March 20, 2025
బాపట్ల: కలెక్టర్‌ను కలిసిన R&B ఈఈ

బాపట్ల జిల్లా రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఆర్. రాజా నాయక్ గురువారం బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టర్‌కు మొక్కను అందజేశారు.
Similar News
News March 29, 2025
NTRకు బ్రహ్మరథం పట్టిన బాపట్ల జిల్లా

సరిగ్గా 43 ఏళ్ల క్రితం ఇదే రోజున(1982 మార్చి 29న) NTR టీడీపీని స్థాపించారు. ఆ తర్వాత 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. రేపల్లెలో ఎడ్ల వెంకట్రావు, వేమూరులో నాదెండ్ల భాస్కరరావు, బాపట్లలో సీవీ రామరాజు, చీరాలలో చిమట సాంబు, పర్చూరులో దగ్గుబాటి చౌదరి, అద్దంకిలో బాచిన చెంచు గరటయ్య టీడీపీ MLAలుగా గెలిచారు.
News March 29, 2025
కృష్ణా: MBA/MCA పరీక్షల షెడ్యూల్ విడుదల

కృష్ణ యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలలో MBA/MCA విద్యార్థులు రాయాల్సిన నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ (థియరీ) పరీక్షలు మే 16 నుంచి నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 2 లోపు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, షెడ్యూల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.
News March 29, 2025
విశాఖలో క్రికెట్ మ్యాచ్‌కు 50 స్పెషల్ బస్సులు

విశాఖలో ఆదివారం జరిగే క్రికెట్ మ్యాచ్‌కు ఏపీఎస్ఆర్టీసీ 30 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు శుక్రవారం తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి మధురవాడ క్రికెట్ స్టేడియానికి నడపనున్నారు. ఈ స్పెషల్ బస్సులు పాత పోస్ట్ ఆఫీస్, సింహాచలం, గాజువాక, కూర్మన్నపాలెం, వివిధ ప్రాంతాల నుంచి మధురవాడకు నడపనున్నట్లు వెల్లడించారు. రద్ధీ అనుగుణంగా బస్సులు పెంచుతామన్నారు.