News March 20, 2025
వీరు షెఫ్‌లే.. కానీ ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే

షెఫ్‌లే కదా అని వారిని తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. వారి ఆస్తులు రూ.కోట్లలో ఉంటాయి మరి. ప్రకటనల్లో తరచూ కనబడే సంజీవ్ కపూర్ దేశంలోని షెఫ్‌లలో అత్యంత ధనవంతుడు. ఆయన ఆస్తి విలువ రూ.1165 కోట్లకు పైమాటే. ఇక ఆ తర్వాతి స్థానాల్లో వికాస్ ఖన్నా(సుమారు రూ.120 కోట్లు), రణ్వీర్ బ్రార్(రూ.41 కోట్లు), కునాల్ కపూర్ (రూ.43.57 కోట్లు), గరిమా అరోరా (రూ.40 కోట్లు), హర్పాల్ సింగ్ సోఖి(రూ.35 కోట్లు) ఉన్నారు.
Similar News
News March 28, 2025
భారత్‌లోనూ భూకంప తీవ్రత

మయన్మార్‌లో సంభవించిన భూకంపం భారత్‌లోనూ ప్రభావం చూపుతోంది. మేఘాలయ, కోల్‌కతా, ఇంఫాల్, ఢిల్లీలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై ఇది 4 తీవ్రతతో నమోదైంది. దీంతో ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. మరోవైపు బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించడంతో థాయ్‌లాండ్ ప్రధాని షినవ్రత దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
News March 28, 2025
తెలుగువారే అగ్రస్థానంలో ఉండాలి: CM చంద్రబాబు

AP: భారతీయులు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని, వారిలోనూ తెలుగువారు ముందుండాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘తెలుగువారు దూసుకెళ్లాలనేది నా స్వార్థం. దీని కోసం అమరావతిలో క్వాంటమ్ వాలీని ప్లాన్ చేస్తున్నాం. అందులోనే అన్ని సాంకేతికతల్ని ఏర్పాటు చేస్తాం. భారత ప్రభుత్వంతో పాటు ఐఐటీ మద్రాస్, ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్టీతో కలిసి పనిచేస్తున్నాం. ఇలాంటిది తీసుకురావడం దేశంలోనే తొలిసారి’ అని వెల్లడించారు.
News March 28, 2025
బిల్ గేట్స్ నాతో మాట్లాడనన్నారు: CM చంద్రబాబు

AP: తాను కలుస్తానని మొదటిసారి కోరినప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇష్టపడలేదని CM చంద్రబాబు ‘మద్రాస్ IIT’ ప్రసంగంలో తెలిపారు. ‘రాజకీయ నాయకులతో తనకు పని లేదని ఆయన అన్నారు. ఒప్పించి 45 నిమిషాలు మాట్లాడాను. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాను. మనమంతా కృషి చేస్తే భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుంది. 2027 నాటికి మూడోస్థానం, 2047 నాటికి అగ్రదేశంగా అవతరిస్తుంది’ అని తెలిపారు.