News March 20, 2025
కామారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్

రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం అయినప్పటికీ.. పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News March 28, 2025
ఈ 3 రంగాలకు AIతో ముప్పు లేదు: బిల్ గేట్స్

AI వల్ల పలు రంగాల్లో ఉద్యోగాలు పోతాయన్న అంచనాల నేపథ్యంలో బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కోడింగ్, బయాలజీ, ఎనర్జీ రంగాల ఉద్యోగాలను AI రీప్లేస్ చేయలేదు. AI కోడింగ్ చేసినా ప్రోగ్రామర్ల అవసరం ఉంటుంది. బయాలజిస్ట్‌లను కూడా అది భర్తీ చేయలేదు. కానీ వ్యాధి నిర్ధారణ, DNA విశ్లేషణ వంటి వాటిలో ఉపయోగపడుతుంది’ అని అన్నారు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని AI ఇంకా సొంతం చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు.
News March 28, 2025
ఇండియన్ ఆర్మీకి సిద్దిపేట యువకుడు ఎంపిక

సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం మగ్ధుంపూర్ గ్రామానికి చెందిన వరిగంటి రాహుల్(20) ఇండియన్ ఆర్మీ జీడీ జవాన్‌గా ఎంపికయ్యాడు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న రాహుల్ ఆర్మీ కావాలన్న లక్ష్యంతో ఈవెంట్స్, పరీక్షలకు సిద్ధమై తన కలను సాకారం చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఐలయ్య, చైతన్య వ్యవసాయం చేస్తున్నారు. సైనికుడిగా దేశానికి సేవలు అందించనున్నరాహుల్‌ను కుటుంబ సభ్యులు, మిత్రులు, గ్రామస్థులు అభినందించారు.
News March 28, 2025
ఈ సీజన్‌లో ఆడతానని అనుకోలేదు: శార్దూల్

IPL వేలంలో ఎంపిక కాకపోవడంతో ఈ సీజన్‌లో ఆడతానని అనుకోలేదని LSG బౌలర్ శార్దూల్ ఠాకూర్ తెలిపారు. ‘నేను కౌంటీ క్రికెట్ ఆడాలని ప్లాన్ చేసుకున్నా. రంజీలో ఆడుతున్నప్పుడు జహీర్ ఖాన్ ఫోన్ చేసి నన్ను రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంటామని చెప్పారు. జీవితంలో ఎత్తుపల్లాలు ఒక భాగం. నేను ఎప్పుడూ నా స్కిల్స్‌నే నమ్ముకుంటా’ అని పేర్కొన్నారు. గాయం కారణంగా టోర్నీకి దూరమైన మోహ్సిన్ ఖాన్ స్థానంలో శార్దూల్ జట్టులోకి వచ్చారు.