News March 20, 2025

‘CSR నిధులతో చెరువుల అభివృద్ధి’

image

ఔట‌ర్ రింగు రోడ్డు ప‌రిధిలో చెరువుల అభివృద్ధికి ఉన్న ఆటంకాల‌న్నీ తొల‌గిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. CSR నిధుల‌తో కార్పొరేట్, స్వ‌చ్ఛంద సంస్థ‌లు ముందుకు రావాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ 72 సంస్థ‌ల ప్ర‌తినిధుల‌కు సూచించారు. చెరువుల సుంద‌రీక‌ర‌ణ‌కే ప‌రిమితం కారాద‌ని, చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయ‌డంపై దృష్టి పెట్టాల‌ని సంస్థ‌ల‌కు సూచించారు.

Similar News

News March 28, 2025

సంగారెడ్డిలో మరో విషాదం..

image

జిల్లాలో మరో విషాదం జరిగింది. కోహిర్ మండలం పైడిగుమ్మల్‌లోని వ్యవసాయ బావిలో పడి ఇద్దరు వలస కార్మికులు మరణించారు. మృతులను యూపీకి చెందిన బైద్యనాథ్, ఒడిశావాసి హరిసింగ్‌గా గుర్తించారు. పైడిగుమ్మల్‌లోని వెంచర్‌లో పనిచేసేందుకు వీరిద్దరు వలస వచ్చారు. వీరు ఈనెల 10న అదృశ్యం కాగా 13న కోహిర్ PSలో కేసు నమోదైంది. గురువారం రాత్రి వ్యవసాయ బావిలో కార్మికుల మృతదేహాలను గుర్తించి వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు.

News March 28, 2025

ఇబ్రహీంపట్నం: మానవ అక్రమ రవాణాపై శిక్షణ కార్యక్రమం

image

మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రంగారెడ్డి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీలత తెలిపారు. మానవ అక్రమ రవాణాపై ఏపీఎం, సీసీలకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లిదండ్రులు లేని పిల్లలను, పేదవారిని నమ్మించి వారి ప్రమేయం లేకుండా నగరాలకు తరలించి అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని తెలిపారు.

News March 28, 2025

మండపేట ఎమ్మెల్సీ తోట అధిష్ఠానంపై అలిగారా..!

image

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అధిష్ఠానంపై అలిగారని పార్టీ క్యాడర్‌లో వదంతులు చక్కెర్ల కొడుతున్నాయి. 25 ఏళ్ల సీనియర్ నాయకుడు అయిన తనను కాదని కాకినాడ జిల్లా అధ్యక్ష పదవిని రాజాకు కట్టబెట్టడంపై అగ్రహంగా ఉన్నారని గుసగసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఉత్తరాంధ్ర కో ఆర్డీనేటర్‌గా కన్నబాబుని పదవి వరించింది. దీనితో తనను నిర్లక్ష్యం చేస్తుండటంతో తటస్థంగా ఉంటున్నారని సన్నిహత వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.

error: Content is protected !!