News March 20, 2025
వనపర్తి: ఈ యాప్ డౌన్లోడ్ చేశారంటే మీ అకౌంట్ ఖాళీ: పోలీసులు

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామ వాట్సాప్ గ్రూపులో పీఎం కిసాన్ నిధి యోజన అనే APK డాక్యుమెంట్ వాట్సాప్ గ్రూప్‌లో రావడంతో కొందరు యువకులు డాక్యుమెంట్ డౌన్లోడ్ చేయగా వారి ఫోన్ హ్యాకింగ్ గురై వాట్సాప్ గ్రూపులన్నింటికీ APK ఫార్వర్డ్ అవుతుంది. కావున పీఎం కిసాన్ యోజన్ అంటూ మెసేజ్ వస్తే దాన్ని ఓపెన్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News March 28, 2025
చైనాకు దగ్గరవుతున్న బంగ్లా

పొరుగు దేశం బంగ్లాదేశ్ చైనాకు దగ్గరవుతోంది. చైనీస్ ఎకనమిక్ అండ్ ఇండస్ట్రియల్ జోన్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు చైనాతో కలిసి పని చేస్తామని ప్రకటించింది. తాము తైవాన్ స్వాతంత్ర్యాన్ని అంగీకరించబోమని, అది చైనాలో భాగమని స్పష్టం చేసింది. తమ దేశంలోని పోర్టులు, ఇతర ప్రాజెక్టుల్లో చైనా భాగం కావాలని కోరింది. అలాగే చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ తమ దేశానికి రావాలని బంగ్లా తాత్కాలిక చీఫ్ యూనస్ ఆహ్వానించారు.
News March 28, 2025
విశాఖ: ‘లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండాలి’

విశాఖ నగర సీపీ శంఖబ్రత బాగ్చి శుక్రవారం కమిషనర్ కార్యాలయంలో నెలవారి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. నగరంలో యాక్టీవ్‌గా ఉన్న రౌడీ షీటర్లపై పెడుతున్న నిఘా చర్యలపై ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా పూర్తిగా నివారించాలని, గంజాయి ఎక్కడా ఉండరాదని ఆదేశించారు. రాత్రి పూట నిఘా పటిష్టం చేయాలని, ఉమెన్ సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News March 28, 2025
BREAKING: టెన్త్ పరీక్ష వాయిదా

AP: ఈనెల 31న జరగాల్సిన టెన్త్ సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ ఎగ్జామ్‌ను ఏప్రిల్ 1న(మంగళవారం) నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 31న స్టోరేజీ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాలు, మెటీరియల్‌ను తీసుకెళ్లొద్దని సిబ్బందికి స్పష్టం చేశారు. కాగా పరీక్షల షెడ్యూల్ విడుదల సమయంలోనే చివరి ఎగ్జామ్ తేదీ విషయంలో మార్పు ఉండొచ్చని పేర్కొన్న విషయం తెలిసిందే.