News March 20, 2025
మంచిర్యాల: KC వేణుగోపాల్‌ను కలిసిన ఎంపీ వంశీ

పార్లమెంట్ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్‌ను కలిసి బడ్జెట్, కుల గణన, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు వంటి అంశాలపై చర్చించారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాల అమలుపై మాట్లాడారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చలు జరిపారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 17, 2025
బెల్లం.. మహిళలకు ఓ వరం

నిత్యం ఇంట్లో, బయట పనులను చేస్తూ మహిళలు తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా కాకూడదంటే బెల్లాన్ని తమ డైట్‌లో చేర్చుకోవాల్సిందే. శరీరానికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు బెల్లంలో పుష్కలంగా ఉంటాయి. బరువును తగ్గించడంతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందంటున్నారు నిపుణులు.
News November 17, 2025
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు: ఇలా త్రిపాఠి

నల్గొండ కలెక్టరేట్లో సోమవారం మొత్తం 129 ఫిర్యాదులు అందాయి. 73 పిర్యాదులు జిల్లా అధికారులకు, 56 రెవెన్యూ శాఖకు సంబంధించినవి వచ్చాయి. ప్రజావాణి ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దన్నారు. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలన్నారు.
News November 17, 2025
KNR: ఓపెన్ స్కూల్ సొసైటీలో భారీ SCAM

ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లో రూ.కోటి వరకు కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. స్టడీ సెంటర్ల నిర్వహణ కోసం వచ్చిన నిధుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 180 ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లు ఉండగా.. ఒక్కో స్టడీ సెంటర్‌కు రూ.30వేల వరకు నిర్వహణ కోసం ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇంతకుముందు కో- ఆర్డినేటర్‌గా పనిచేసిన ఉద్యోగికి ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


