News March 20, 2025

వనపర్తి: వృద్ధాప్య తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి: వి.రజని

image

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. గురువారం వనపర్తిలోని సీనియర్ సిటిజన్ ఫోరంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వృద్ధుల సంక్షేమం కోసం అనేక చట్టాలు ఉన్నాయని, వారి సంరక్షణకు హెల్ప్ లైన్ నంబర్ 14567ను ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News March 22, 2025

డీలిమిటేషన్‌పై వారివి అపోహలే: కిషన్ రెడ్డి

image

TG: డీలిమిటేషన్ ఇంకా ప్రారంభం కాలేదని, కాంగ్రెస్, DMK, BRS మాత్రం ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. BJPపై విషం కక్కడమే వారి ఎజెండా అని విమర్శించారు. ‘డీలిమిటేషన్ పూర్తి కాకుండానే దక్షిణాదికి అన్యాయం అంటూ ప్రచారం చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ కుట్ర చేస్తున్నారు. సౌత్, నార్త్ మధ్య విభజన తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాయి’ అంటూ ఫైర్ అయ్యారు.

News March 22, 2025

2047ల‌క్ష్య సాధ‌న దిశ‌గా ముంద‌డుగు వేద్దాం: లంకా 

image

విక‌సిత్ భార‌త్, స్వ‌ర్ణాంధ్ర @ 2047 ల‌క్ష్య సాధ‌న దిశ‌గా ముంద‌డుగు వేద్దామ‌ని, ల‌క్ష్యాల సాధ‌న‌లో అధికారులే ర‌థ సార‌థుల‌ని ఇర‌వై సూత్రాల కార్య‌క్ర‌మాల అమ‌లు క‌మిటీ ఛైర్మ‌న్ లంకా దిన‌క‌ర్ అన్నారు. శ‌నివారం క‌లెక్ట‌రేట్ కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై స‌మీక్ష  జ‌రిగింది. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్‌, క‌లెక్ట‌ర్ ల‌క్ష్మశ పాల్గొన్నారు. 

News March 22, 2025

జగన్ అభిప్రాయం అదిములపు సురేష్ ద్వారా చెప్పించారా?: మందకృష్ణ మాదిగ

image

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సామాజిక న్యాయంగా చూస్తున్నారా, దళితుల మధ్య చిచ్చుగా చూస్తున్నారా అనేది వైసీపీ అధినేత జగన్ స్పష్టత ఇవ్వాలని మందకృష్ణ మాదిగ అన్నారు. గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ గురించి జగన్ సమర్థిస్తున్నారా, లేక వ్యతిరేకిస్తున్నారా? జగన్ అభిప్రాయం అదిమూలపు సురేష్ ద్వారా చెప్పించారా? అనేది జగన్మోహన్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని మందకృష్ణ కోరారు.

error: Content is protected !!