News March 20, 2025

ALERT: ఆ జిల్లాల్లో ఉరుములు.. వడగండ్ల వానలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో <>రేపు, ఎల్లుండి<<>> ఉరుములు, మెరుపులు, తీవ్రగాలులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Similar News

News September 19, 2025

రోజూ వాల్‌నట్స్ తింటే ఇన్ని ప్రయోజనాలా?

image

* మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి
* బరువును నియంత్రిస్తాయి
* గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి
* సంతాన సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతాయి
* ఎముకలను బలోపేతం చేస్తాయి
* క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి
* షుగర్ రాకుండా కాపాడుతాయని వైద్యులు చెబుతున్నారు.
Share It

News September 19, 2025

కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మంత్రి, ఎమ్మెల్యే లేరు: కేటీఆర్

image

TG: వంద రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ BRS కార్యకర్తలతో సమావేశమైన ఆయన మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను గెలిపించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మంత్రి గానీ, ముస్లిం ఎమ్మెల్యే గానీ, ముస్లిం ఎమ్మెల్సీ గానీ లేరని వ్యాఖ్యానించారు.

News September 19, 2025

ఈనెల 22న ‘కాంతార-1’ ట్రైలర్

image

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార-1’ సినిమా ట్రైలర్ విడుదలపై అప్డేట్ వచ్చింది. ఈనెల 22న మధ్యాహ్నం 12.45 గంటలకు ట్రైలర్ రిలీజ్ అవుతుందని ప్రకటిస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా దసరా సందర్భంగా ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించగా హొంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది.