News March 20, 2025

తాగునీటి సరఫరాకు ప్రణాళికను అమలు చేయాలి: కలెక్టర్

image

క్షేత్రస్థాయిలో తాగునీటి సరఫరాకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, తదితర అధికారులతో ఇందిరమ్మ ఇళ్లు, మిషన్ భగీరథ, తాగు నీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. వడదెబ్బ తగలకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలనే అంశంపై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

Similar News

News March 28, 2025

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం షాక్

image

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం షాకిచ్చింది. జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ ప్రతిపాదనలు పంపింది. కాగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం వెనక్కి పంపింది. కోర్టు వివాదం నేపథ్యంలో తెలంగాణ పంపిన ప్రాజెక్ట్ టెక్నో ఎకనమిక్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవడం సాధ్యం కాదని కేంద్ర జలశక్తిశాఖ తెలిపింది.

News March 28, 2025

చైనాకు దగ్గరవుతున్న బంగ్లా

image

పొరుగు దేశం బంగ్లాదేశ్ చైనాకు దగ్గరవుతోంది. చైనీస్ ఎకనమిక్ అండ్ ఇండస్ట్రియల్ జోన్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు చైనాతో కలిసి పని చేస్తామని ప్రకటించింది. తాము తైవాన్ స్వాతంత్ర్యాన్ని అంగీకరించబోమని, అది చైనాలో భాగమని స్పష్టం చేసింది. తమ దేశంలోని పోర్టులు, ఇతర ప్రాజెక్టుల్లో చైనా భాగం కావాలని కోరింది. అలాగే చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ తమ దేశానికి రావాలని బంగ్లా తాత్కాలిక చీఫ్ యూనస్ ఆహ్వానించారు.

News March 28, 2025

విశాఖ: ‘లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండాలి’

image

విశాఖ నగర సీపీ శంఖబ్రత బాగ్చి శుక్రవారం కమిషనర్ కార్యాలయంలో నెలవారి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. నగరంలో యాక్టీవ్‌గా ఉన్న రౌడీ షీటర్లపై పెడుతున్న నిఘా చర్యలపై ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా పూర్తిగా నివారించాలని, గంజాయి ఎక్కడా ఉండరాదని ఆదేశించారు. రాత్రి పూట నిఘా పటిష్టం చేయాలని, ఉమెన్ సేఫ్టీ‌కి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

error: Content is protected !!