News March 20, 2025
విద్యార్థులు క్రమశిక్షణతో, ధైర్యంగా పరీక్షలు రాయాలి: కలెక్టర్

రేపటి నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో, ధైర్యంగా పరీక్షలు వ్రాయాలని సూచించారు. విద్యార్థులు సంవత్సర కాలం పాటు ఉపాధ్యాయుల శిక్షణలో ఎంతో శ్రమించి, పట్టుదలతో ఈ దశకు చేరుకుని పూర్తి స్థాయిలో సన్నదం అయ్యారని తెలిపారు.
Similar News
News March 28, 2025
విషమంగా అంజలి ఆరోగ్యం.. నిందితుడు అరెస్ట్

AP: ఓ వ్యక్తి చేతిలో మోసపోయానంటూ రాజమండ్రిలో <<15894441>>ఆత్మహత్యాయత్నం<<>> చేసిన ఫార్మసీ విద్యార్థిని అంజలి(23) ఆరోగ్యం విషమంగానే ఉంది. ఆమె బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని, నేచురల్‌గానే రికవరీ అవ్వాలని వైద్యులు చెబుతున్నారు. సూసైడ్ నోటు ఆధారంగా మాధవరావు దీపక్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. అంజలికి మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని తోటి విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
News March 28, 2025
పార్వతీపురం: ఉపాధి హామీ పథకం కింద 117 సాగునీటి పనులు

ఉపాధి హామీ పథకం కింద 117 సాగునీటి వసతులలో పూడికలు తీసే అవకాశం ఉందని కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. 331 ప్రహారీ గోడలను మంజూరు చేయగా 317 పనులు ప్రారంభం అయ్యాయని, మిగిలిన పనులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. వంద ఎకరాలకు మించి ఆయకట్టు ఉన్న చెరువులలో చేపల పెంపకానికి పనులు చేపట్టాలన్నారు. పంట గుంతలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
News March 28, 2025
కొలికపూడి వివాదాలపై సమగ్ర నివేదిక కోరిన అధిష్ఠానం

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదాలపై ఆ పార్టీ అధిష్ఠానం సమగ్ర నివేదిక కోరింది. పార్టీ నాయకులు, ఎమ్మెల్యేకి మధ్య ఆది నుంచి నెలకొన్న వివాదాల కారణంగా పార్టీకి తీరని నష్టం వాటిల్లుతోందని గ్రహించిన అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో శుక్రవారం 3 మెన్ కమిటీ హై కమాండ్ నియమించింది. గత 10నెలలుగా ఎమ్మెల్యే కేంద్రంగా జరిగిన వివాదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశాలు జారీచేశారు.