News March 20, 2025
శ్రీ సత్యసాయి: 171 మందికి బదిలీలు

జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 171 మందికి బదిలీ ప్రక్రియ నిర్వహించినట్లు డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ క్యాడర్‌లలో పనిచేస్తున్న వారికి గురువారం బదిలీలు చేపట్టామన్నారు. 21 మంది ఏపీవోలు, 50 మంది కోఆర్డినేటర్స్, 18 మంది ఈసీ, 81 మంది టెక్నికల్ అసిస్టెంట్ల బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు.
Similar News
News March 28, 2025
రాజంపేట: రైలు కిందపడి యువకుడి మృతి

రాజంపేట పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న బాలు స్టూడియో యజమాని వోలేటి బాలాంజనేయులు (29) శుక్రవారం ఉదయం రాజంపేట రైల్వే స్టేషన్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. పుల్లంపేట మండలం బావికాడపల్లెకు చెందిన మృతుడికి సంవత్సరం క్రితం వివాహమైనట్లు బంధువులు తెలిపారు. ఆత్మహత్యకు కారణమేంటి అనే వివరాలు తెలియాల్సి ఉంది.
News March 28, 2025
ఖైరతాబాద్ : ఉదయం 8 నుంచి రాత్రి 11 వరకు డ్యూటీ

జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందికి ఈ నెల 31 వరకు దాదాపు విశ్రాంతి ఉండేలాగా కనిపించడంలేదు. ఆయా సర్కిల్ కార్యాలయాల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు విధులు నిర్వర్తిస్తారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆస్తి పన్ను వడ్డీపై ఇచ్చే 90% రాయితీని ఉపయోగించుకోవాలని గ్రేటర్ కమిషనర్ ఇలంబర్తి నగర ప్రజలకు సూచించారు.
News March 28, 2025
అత్తిలిలో కూటమి నేతల ఆందోళన అందుకేనా?

అత్తిలి ఎంపీపీ తీవ్ర ఉత్కంఠను రేపుతున్న విషయం తెలిసిందే. వైసీపీకి చెందిన 13 మంది ఎంపీటీసీ సభ్యులు ఎన్నిక సమావేశానికి హాజరు కాకుండా కూటమి శ్రేణులు అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను వైసీపీ నేతలు నిర్బంధించారని.. వారి కోసమే తమ ఆందోళన అని కూటమి శ్రేణులు అంటున్నాయి.