News March 20, 2025
జనగామ: గ్రామ పంచాయతీ స్థాయిలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి: కలెక్టర్

ప్రతి గ్రామ పంచాయతీ స్థాయిలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని గురువారం అధికారులతో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా అధికారులను ఆదేశించారు. అలాగే చలివేంద్రాల వద్ద పరిశుభ్రత పాటించాలని, తాగునీరు, గ్లాసులు, కుండలు, వాటిపై ప్లేట్లు ఉండాలని, అవన్నీ పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు. ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం తగదని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News November 10, 2025
నా భర్త హీరోయిన్స్‌తోనే ఎక్కువ గడుపుతాడు: గోవింద భార్య

బాలీవుడ్ నటుడు గోవిందపై ఆయన భార్య సునీత సంచలన కామెంట్స్ చేశారు. ఆయన తన కంటే హీరోయిన్స్ వద్దే ఎక్కువ సమయం గడుపుతాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరో మహిళతో గోవింద అఫైర్ ప్రచారంపై స్పందిస్తూ ‘నేను ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోలేదు కాబట్టి దాన్ని కన్ఫర్మ్ చేయలేను. కాకపోతే ఆమె మరాఠీ నటి అని విన్నా’ అని అన్నారు. వివాదాలతో విడాకులు తీసుకుంటున్నారన్న ప్రచారాన్ని వీరిద్దరూ గతంలో ఖండించారు.
News November 10, 2025
విశాఖ సదస్సుతో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: లోకేశ్

AP: విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో పెట్టుబడుల సదస్సును విజయవంతం చేద్దామని మంత్రి లోకేశ్ సహచర మంత్రులకు పిలుపునిచ్చారు. ఈ సమ్మిట్‌తో ₹10L కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇచ్చిన హామీ మేరకు 20లక్షల ఉద్యోగాల కల్పన త్వరగా నెరువేరుద్దామని చెప్పారు. ప్రతీ మంత్రి తమ శాఖల పరిధిలోని ఒప్పందాల విషయంలో బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.
News November 10, 2025
గాజువాక: బార్లో వెయిటర్ ఆత్మహత్య

గాజువాకలోని ఓ బార్లో వెయిటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. వై.జంక్షన్ వద్ద బార్ అండ్ రెస్టారెంట్లో చంద్రమోహన్ అనే వ్యక్తి వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. బార్లోనే చంద్రమోహన్ ఉరివేసుకోవడంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.


