News March 20, 2025

ప్రేమ విఫలం.. ధర్మవరంలో యువకుడి ఆత్మహత్య

image

ప్రేమ విఫలమైందని ధర్మవరం పట్టణం గిర్రాజు కాలనీకి చెందిన బద్దెల ఓబునాథ్ (35) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అందిన వివరాల మేరకు.. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరాడు. నిరాకరించిందని మనస్తాపం చెంది గురువారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓబునాథ్ టైల్స్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 28, 2025

విజయనగరంలో బాలికపై బాలుడు అత్యాచారయత్నం

image

విజయనగరం రూరల్ పరిధిలో బాలికపై ఓ బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్ తెలిపారు. ఈనెల 26న ఈ ఘటన జరగ్గా కేసు నమోదు చేశామన్నారు. ఇంటిలో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో బాలుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో బాలుడు పరారయ్యాడన్నారు. దీనిపై బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.

News March 28, 2025

హీరోను అంటూ నమ్మించి దారుణం.. కేసు నమోదు

image

హీరోను అంటూ నమ్మించి మహిళను మోసం చేసిన ఘటనలో యువకుడిపై నెల్లూరు(D) చిన్నబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి(D) కోట(M)నికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడిపోయింది. నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తోంది. ఆమెకు ఇన్‌స్టాలో సునీల్ రెడ్డి పరిచయం అయ్యాడు. హీరోను అంటూ నమ్మించి లాడ్జిలో శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకోమని కోరగా ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలతో సునీల్ బెదిరించి దాడి చేశాడు.

News March 28, 2025

బెల్లంపల్లి: భార్యకు వేరే పెళ్లి.. భర్త ఆత్మహత్య

image

బెల్లంపల్లి హనుమాన్ బస్తీకి చెందిన మంతెన శివకుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 1-టౌన్ సీఐ దేవయ్య వివరాలు.. శివకుమార్‌కు 8 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం జరిగింది. HYDలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సమయంలో యాక్సిడెంట్ కాగా కాలు విరిగింది. దీంతో అతని వదిలి భార్య వేరే పెళ్లి చేసుకుంది. దీంతో జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

error: Content is protected !!