News March 20, 2025
IPL: KKRvsLSG మ్యాచ్ రీషెడ్యూల్

ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన KKRvsLSG మ్యాచ్‌ను గువాహటికి బీసీసీఐ మార్చింది. ఆ రోజున శ్రీరామనవమి సందర్భంగా కోల్‌కతాలో భారీగా ఊరేగింపులు జరగనున్నాయి. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ను రీ షెడ్యూల్ చేశారు. గత ఏడాది KKRvsRR మ్యాచునూ ఇదే కారణంతో వాయిదా వేశారు.
Similar News
News March 28, 2025
చైనాకు దగ్గరవుతున్న బంగ్లా

పొరుగు దేశం బంగ్లాదేశ్ చైనాకు దగ్గరవుతోంది. చైనీస్ ఎకనమిక్ అండ్ ఇండస్ట్రియల్ జోన్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు చైనాతో కలిసి పని చేస్తామని ప్రకటించింది. తాము తైవాన్ స్వాతంత్ర్యాన్ని అంగీకరించబోమని, అది చైనాలో భాగమని స్పష్టం చేసింది. తమ దేశంలోని పోర్టులు, ఇతర ప్రాజెక్టుల్లో చైనా భాగం కావాలని కోరింది. అలాగే చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ తమ దేశానికి రావాలని బంగ్లా తాత్కాలిక చీఫ్ యూనస్ ఆహ్వానించారు.
News March 28, 2025
BREAKING: టెన్త్ పరీక్ష వాయిదా

AP: ఈనెల 31న జరగాల్సిన టెన్త్ సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ ఎగ్జామ్‌ను ఏప్రిల్ 1న(మంగళవారం) నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 31న స్టోరేజీ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాలు, మెటీరియల్‌ను తీసుకెళ్లొద్దని సిబ్బందికి స్పష్టం చేశారు. కాగా పరీక్షల షెడ్యూల్ విడుదల సమయంలోనే చివరి ఎగ్జామ్ తేదీ విషయంలో మార్పు ఉండొచ్చని పేర్కొన్న విషయం తెలిసిందే.
News March 28, 2025
ధోనీ క్రేజ్ వల్ల చెన్నైకి దెబ్బే: అంబటి రాయుడు

భారీగా పెరుగుతున్న ధోనీ మేనియా సీఎస్కేకు మంచిది కాదని అంబటి రాయుడు ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘చాలా మంది అభిమానులు ధోనీ బ్యాటింగ్ చూసేందుకే స్టేడియానికి వస్తుంటారు. వారు సీఎస్కే టీమ్‌లోని మిగతా బ్యాటర్లు త్వరగా ఔటై వెళ్లిపోవాలని కోరుకుంటారు. కొత్త ఆటగాళ్లకు ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. దీనివల్ల చెన్నైకి కొత్త నాయకుడు తయారు కావడం కష్టం అవుతుంది’ అని చెప్పారు.