News March 20, 2025

PDPL: ముగిసిన ఇంటర్ పరీక్షలు: జిల్లా అధికారి కల్పన

image

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశామని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి కల్పన తెలిపారు. నేటి పరీక్షకు 4532 మంది హాజరు కావాల్సి ఉండగా, 4428 మంది హాజరు కాగా, 104 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని అన్నారు. ఇవాళ 97.7% హాజరు నమోదయిందన్నారు. ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News March 28, 2025

రాజంపేట: రైలు కిందపడి యువకుడి మృతి

image

రాజంపేట పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న బాలు స్టూడియో యజమాని వోలేటి బాలాంజనేయులు (29) శుక్రవారం ఉదయం రాజంపేట రైల్వే స్టేషన్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. పుల్లంపేట మండలం బావికాడపల్లెకు చెందిన మృతుడికి సంవత్సరం క్రితం వివాహమైనట్లు బంధువులు తెలిపారు. ఆత్మహత్యకు కారణమేంటి అనే వివరాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2025

ఖైరతాబాద్ : ఉదయం 8 నుంచి రాత్రి 11 వరకు డ్యూటీ

image

జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందికి ఈ నెల 31 వరకు దాదాపు విశ్రాంతి ఉండేలాగా కనిపించడంలేదు. ఆయా సర్కిల్ కార్యాలయాల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు విధులు నిర్వర్తిస్తారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆస్తి పన్ను వడ్డీపై ఇచ్చే 90% రాయితీని ఉపయోగించుకోవాలని గ్రేటర్ కమిషనర్ ఇలంబర్తి నగర ప్రజలకు సూచించారు.

News March 28, 2025

అత్తిలిలో కూటమి నేతల ఆందోళన అందుకేనా?

image

అత్తిలి ఎంపీపీ తీవ్ర ఉత్కంఠను రేపుతున్న విషయం తెలిసిందే. వైసీపీకి చెందిన 13 మంది ఎంపీటీసీ సభ్యులు ఎన్నిక సమావేశానికి హాజరు కాకుండా కూటమి శ్రేణులు అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను వైసీపీ నేతలు నిర్బంధించారని.. వారి కోసమే తమ ఆందోళన అని కూటమి శ్రేణులు అంటున్నాయి.

error: Content is protected !!