News March 20, 2025
MF హుస్సేన్ పెయింటింగ్‌కు రూ.118 కోట్లు

ఎంఎఫ్ హుస్సేన్ ‘అన్‌టైటిల్డ్(గ్రామ్ యాత్ర)’ పెయింటింగ్‌ను న్యూయార్క్‌లో వేలం వేయగా రూ.118 కోట్లకు అమ్ముడుపోయింది. భారత గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించే 13 రకాల చిత్రాలను 14 అడుగుల కాన్వాస్‌లో ఆయన 1954లో చిత్రీకరించారు. భారత చరిత్రలో అత్యంత ఖరీదైన పెయింటింగ్‌గా ఇది రికార్డు సృష్టించింది. అమృతా షెర్గిల్ 1937లో గీసిన ‘ది స్టోరీ టెల్లర్’ పెయింటింగ్‌కు 2023లో రూ.61.8 కోట్ల ధర పలికింది.
Similar News
News March 28, 2025
మా శ్రమతోనే BYD రాష్ట్రానికి వచ్చింది: కేటీఆర్

TG: తాము అధికారంలో ఉన్నప్పుడు పడ్డ శ్రమ రాష్ట్రానికి ఇప్పుడు ఫలితాల్ని ఇస్తోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్విటర్‌లో తెలిపారు. ‘BYD రాష్ట్రంలో 10బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు 2022-23లో ఒప్పందం చేసుకున్నాం. కేంద్రం కారణంగా అప్పట్లో అది ఆగింది. ఆ పెట్టుబడులు ఎట్టకేలకు రాష్ట్రానికి వస్తుండటం సంతోషం. కేవలం మా ప్రభుత్వ విధానాల వల్లే ఇది సాధ్యమైంది’ అని పేర్కొన్నారు.
News March 28, 2025
RCB గెలుపు దాహం తీర్చుకుంటుందా?

IPLలో భాగంగా ఇవాళ చెపాక్ స్టేడియంలో RCBvsCSK మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన ఊపును ఇవాళ కూడా కొనసాగించాలని CSK భావిస్తోంది. పైగా ఈ స్టేడియంలో బెంగళూరుపై చెన్నైదే పైచేయి. ఇక్కడ చివరగా 17 ఏళ్ల క్రితం 2008లో CSKపై RCB గెలిచింది. ఆ తర్వాత ఏడు మ్యాచులు ఆడితే ఒక్కటీ గెలవలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలిచి సత్తా చూపెట్టాలని RCB వ్యూహాలు రచిస్తోంది.
News March 28, 2025
వచ్చే నెలలో థాయ్‌లాండ్, శ్రీలంకలో పీఎం పర్యటన

వచ్చే నెల 3 నుంచి 6 వరకు ప్రధాని నరేంద్ర మోదీ థాయ్‌లాండ్, శ్రీలంక దేశాల్లో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. బ్యాంకాక్‌లో జరిగే 6వ BIMSTEC సదస్సులో ఆయన పాల్గొంటారని పేర్కొంది. 2018లో నేపాల్‌లో జరిగిన సదస్సు అనంతరం BIMSTEC నేతలు సరాసరి పాల్గొనే తొలి సదస్సు ఇదే. దీని అనంతరం శ్రీలంక పర్యటనలో ఆయన పలు ఒప్పందాల్ని చేసుకునే అవకాశం ఉంది.