News March 20, 2025
నన్ను కలిసేందుకు డబ్బులు అవసరం లేదు: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి లండన్ టూర్‌ను కొందరు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యాన్ మీట్ పేరుతో చిరును కలిసే అవకాశం కల్పిస్తామంటూ కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై చిరు Xలో స్పందించారు. ‘ఫ్యాన్ మీటింగ్ పేరుతో ఇలా డబ్బులు వసూలు చేయడాన్ని నేను ఏమాత్రం ఒప్పుకోను. వారి డబ్బులు వెనక్కి ఇచ్చేయండి. నన్ను కలవడానికి ఎవరికీ డబ్బులు చెల్లించనక్కర్లేదు’ అని ఫ్యాన్స్‌కు సూచించారు.
Similar News
News March 28, 2025
భూకంపం నుంచి తప్పించుకున్న తెలంగాణ MLA ఫ్యామిలీ

బ్యాంకాక్‌లో భూకంపం నుంచి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబం త్రుటిలో తప్పించుకుంది. రాజ్ ఠాకూర్ భార్య, కూతురు, అల్లుడు బ్యాంకాక్ పర్యటనకు వెళ్లారు. అక్కడ భారీ భూకంపం ధాటికి అనేక బిల్డింగులు కుప్పకూలాయి. అయితే ఆ ముగ్గురికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. వారు తిరిగి విమానాశ్రయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే మాత్రం హైదరాబాద్‌లోనే ఉన్నారు.
News March 28, 2025
కుప్పకూలిన 1000 పడకల ఆసుపత్రి.. భారీగా క్షతగాత్రులు

భూకంప తీవ్రతకు మయన్మార్ రాజధాని నేపిడాలో 1,000 పడకల ఆసుపత్రి కుప్పకూలింది. ఇందులో పెద్ద ఎత్తున క్షతగాత్రులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మండలే నగరంలో ఒక వంతెన కూలిపోయింది. పలు చోట్ల ఎత్తైన భవనాలు, గుళ్లు నేలకొరిగాయి. ఇప్పటి వరకూ 55మంది మృతి చెందినట్లు అధికారులు తెలుపగా సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. బ్యాంకాక్‌లో భారీ భవనం కూలడంతో ముగ్గురు మృతి చెందగా పదుల సంఖ్యలో శిథిలాల కింద చిక్కుకున్నారు.
News March 28, 2025
రూ.లక్ష లంచం తీసుకుంటూ దొరికిన జిల్లా రిజిస్ట్రార్

AP: కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు, అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తన భార్య పేరిట ఉన్న గ్యాస్ ఏజెన్సీని తన పేరు మీదకు మార్చాలంటూ తునికి చెందిన రమేశ్‌బాబు రిజిస్ట్రార్‌ను ఆశ్రయించారు. ఇందుకు ఆయన రూ.లక్ష డిమాండ్ చేయడంతో రమేశ్ ఏసీబీకి సమాచారమిచ్చారు. దీంతో నిఘా వేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.