News March 20, 2025

యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్.. చివరికి!

image

కడుపునొప్పి తాళలేక ఓ వ్యక్తి యూట్యూబ్ సాయంతో ఆపరేషన్‌కు ప్రయత్నించి ఆస్పత్రి పాలయ్యాడు. UP మధురలో ఈ ఘటన జరిగింది. అనేక మంది వైద్యులను సంప్రదించినా రాజబాబు(32)కు కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభించలేదు. దీంతో మత్తు ఇంజెక్షన్, ఇతర సామగ్రి కొని ఆపరేషన్ మొదలుపెట్టాడు. మత్తు ప్రభావం తగ్గడంతో నొప్పి ఎక్కువై అరుస్తూ బయటికి పరిగెత్తగా, కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

Similar News

News March 28, 2025

పూరీ జగన్నాథ్ సినిమాకు నో చెప్పాను: రకుల్

image

తన కెరీర్ ఆరంభంలో ఎన్నో సినిమాల్ని వదులుకున్నానని రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘కాలేజీలో చదువుకుంటున్న సమయంలో మోడలింగ్ చేశా. కన్నడ పరిశ్రమలో తొలి ఆఫర్ వచ్చింది. అది రిలీజయ్యాక పూరీ జగన్నాథ్ నుంచి ఫోన్ వచ్చింది. 70 రోజులు డేట్స్ కావాలన్నారు. అప్పటికి చదువుకుంటుండటంతో 4 రోజులు మాత్రమే ఇవ్వగలనన్నాను. అదే తరహాలో చాలా సినిమాల్ని వదులుకోవాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు.

News March 28, 2025

బ్రిటన్‌ను వదిలేస్తున్న భారత సంతతి కుబేరుడు!

image

ఇతర వ్యాపారుల్లాగే ఆర్సెలార్ స్టీల్ కంపెనీ అధినేత లక్ష్మీమిత్తల్ UKను వదిలేస్తారని సమాచారం. 30 ఏళ్లుగా విదేశీ ఆదాయం, లాభాలపై ఇస్తున్న పన్ను మినహాయింపులను ప్రస్తుత లెఫ్టిస్టు ప్రభుత్వం ఎత్తేయడమే ఇందుకు కారణం. ‘మిత్తల్ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. ఏడాదిలోపు తుది నిర్ణయం తీసుకోవచ్చు’ అని FT పేర్కొంది. పన్నుల వల్ల బ్రిటన్ సంపన్నులు ఎక్కువగా UAE, స్విట్జర్లాండ్, ఇటలీకి వలస వెళ్తున్నారు.

News March 28, 2025

సోషల్ మీడియా బజ్: RCBని డామినేట్ చేసిన CSK

image

ఇవాళ రాత్రి జరిగే RCBvsCSK హైఓల్టేజ్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో రెండు జట్ల అభిమానులు పోస్టులతో హోరెత్తిస్తున్నారు. గత 24 గంటల్లో చెన్నైకి అనుకూలంగా 52%, బెంగళూరుకు 48% మంది మద్దతుగా నిలిచారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను స్టార్ స్పోర్ట్స్ SMలో విడుదల చేసింది. ఏది ఏమైనా చివరికి మ్యాచ్‌లో తమదే విజయమని ఇరు టీమ్స్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.
ఇవాళ ఎవరు గెలుస్తారు? మీ కామెంట్.

error: Content is protected !!