News March 20, 2025

ఏలూరు: 4,060,14 గృహాలకు కుళాయి కనెక్షన్: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ కుళాయి కనెక్షన్ అందించే కార్యక్రమంలో భాగంగా మొత్తం 4,74,978 గృహాలకుగాను, 4,060,14 గృహాలకు కుళాయి కనెక్షన్ అందించడం జరిగిందని కలెక్టర్ వెట్రిసెల్వి గురువారం తెలిపారు. మిగిలిన గృహాలకు కూడా నిర్దేశించిన సమయంలో కుళాయి కనెక్షన్లు అందించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News March 28, 2025

మోదీ, చంద్రబాబు, పవన్ ఫొటోలకు పాలాభిషేకం

image

సూర్యలంక సముద్ర తీర అభివృద్ధికి రూ.97 కోట్లు మంజూరు కావడంపై కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈక్రమంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ చిత్రపటాలకు సూర్యలంక సముద్రతీరం వద్ద పాలాభిషేకం నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ.. బాపట్లలో పర్యాటక రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

News March 28, 2025

భారత్‌లోనూ భూకంప తీవ్రత

image

మయన్మార్‌లో సంభవించిన భూకంపం భారత్‌లోనూ ప్రభావం చూపుతోంది. మేఘాలయ, కోల్‌కతా, ఇంఫాల్, ఢిల్లీలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై ఇది 4 తీవ్రతతో నమోదైంది. దీంతో ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. మరోవైపు బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించడంతో థాయ్‌లాండ్ ప్రధాని షినవ్రత దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

News March 28, 2025

తెలుగువారే అగ్రస్థానంలో ఉండాలి: CM చంద్రబాబు

image

AP: భారతీయులు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని, వారిలోనూ తెలుగువారు ముందుండాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘తెలుగువారు దూసుకెళ్లాలనేది నా స్వార్థం. దీని కోసం అమరావతిలో క్వాంటమ్ వాలీని ప్లాన్ చేస్తున్నాం. అందులోనే అన్ని సాంకేతికతల్ని ఏర్పాటు చేస్తాం. భారత ప్రభుత్వంతో పాటు ఐఐటీ మద్రాస్, ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్‌టీతో కలిసి పనిచేస్తున్నాం. ఇలాంటిది తీసుకురావడం దేశంలోనే తొలిసారి’ అని వెల్లడించారు.

error: Content is protected !!