News March 20, 2025

భారత్‌కు సొంతంగా బ్రౌజర్!

image

భారత పౌరుల డేటా భద్రత, గోప్యత కోసం సొంతంగా బ్రౌజర్‌ను అభివృద్ధి చేస్తున్నామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ‘సేవల నుంచి ఉత్పత్తుల వైపు మళ్లేందుకు భారత్‌కు ఇదో సదవకాశం. బ్రౌజర్‌కోసం పోటీలు నిర్వహిస్తే విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, విద్యార్థులు, పరిశోధకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మన ప్రజల సమాచారం విదేశీ శక్తుల చేతుల్లో పడకుండా ఉండేందుకే బ్రౌజర్‌ను అభివృద్ధి చేస్తున్నాం’ అని వివరించారు.

Similar News

News March 23, 2025

IPL-2025: 300 స్కోర్ లోడింగ్?

image

ఉప్పల్‌లో SRH బ్యాటర్ల ముందు బౌండరీలు చిన్నబోతున్నాయి. ఫోర్లు, సిక్సులే లక్ష్యంగా బౌలర్లపై ఎదురుదాడికి దిగుతుండటంతో 17 ఓవర్లకు స్కోర్ 230 దాటింది. ఈ క్రమంలో IPL చరిత్రలో తొలిసారి 300 స్కోర్ చేసే ఛాన్స్ కన్పిస్తోంది. గత సీజన్లో ఇదే SRH జట్టు బెంగళూరుపై లీగ్ చరిత్రలో 287/3 భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే. తొలి ఓవర్ నుంచే బ్యాటర్లు హిట్టింగ్ ప్రారంభించగా RR బౌలర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది.

News March 23, 2025

స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన లోకేశ్ ఫ్యామిలీ

image

AP: మంత్రి లోకేశ్ కుటుంబ సమేతంగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘పవిత్రమైన శ్రీ హర్మందిర్ సాహిబ్‌ను సందర్శించే అదృష్టం కలిగింది. అందరికీ శాంతి, శ్రేయస్సు కోసం ప్రార్థించాను. స్వర్ణ దేవాలయం దైవిక ప్రశాంతత నిజంగా స్ఫూర్తిదాయకం. వాహెగురు ఆశీస్సులు మనందరికీ మార్గనిర్దేశం చేస్తాయి’ అని ట్వీట్ చేశారు.

News March 23, 2025

సీట్లే కాదు పార్లమెంటులో ప్రాధాన్యత కోసం పోరాటం: కేకే

image

TG: పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఇంకా పెరగాలని ప్రభుత్వ సలహాదారు K కేశవరావు ఆకాంక్షించారు. ఎంపీ సీట్ల గురించే కాకుండా పార్లమెంటులో తమ గళానికి ప్రాధాన్యత కోసం రాష్ట్రాలు పోరాడుతున్నాయని చెప్పారు. అన్ని రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే కేంద్రం డీలిమిటేషన్‌పై ముందుకెళ్లాలని సూచించారు. పార్లమెంటులో చట్టం ఆమోదం పొందాకే పునర్విభజన చేయాలన్నారు.

error: Content is protected !!