News March 20, 2025
నంద్యాల జిల్లా TODAY NEWS

☞ ఏప్రిల్ 19న కర్నూలుకు సీఎం చంద్రబాబు ☞ వాగులోకి దూసుకెళ్లిన బైక్.. వ్యక్తి గల్లంతు ☞ టంగుటూరులో బైరెడ్డి పూజలు ☞ ఈనెల 22న ఓర్వకల్లుకు పవన్ కళ్యాణ్ ☞ అవుకులో నకిలీ రంగుల కలకలం ☞ కీచక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు: కలెక్టర్ ☞ యాగంటి హుండీ ఆదాయం రూ.29.18 లక్షలు ☞ మహానందిలో ఉద్యోగుల అంతర్గత బదిలీలు ☞ ట్రోపీలు అందుకున్న జిల్లా నేతలు ☞ ఈనెల 23న జిల్లాకు భారీ వర్ష సూచన
Similar News
News March 28, 2025
మోదీ, చంద్రబాబు, పవన్ ఫొటోలకు పాలాభిషేకం

సూర్యలంక సముద్ర తీర అభివృద్ధికి రూ.97 కోట్లు మంజూరు కావడంపై కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈక్రమంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ చిత్రపటాలకు సూర్యలంక సముద్రతీరం వద్ద పాలాభిషేకం నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ.. బాపట్లలో పర్యాటక రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
News March 28, 2025
భారత్‌లోనూ భూకంప తీవ్రత

మయన్మార్‌లో సంభవించిన భూకంపం భారత్‌లోనూ ప్రభావం చూపుతోంది. మేఘాలయ, కోల్‌కతా, ఇంఫాల్, ఢిల్లీలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై ఇది 4 తీవ్రతతో నమోదైంది. దీంతో ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. మరోవైపు బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించడంతో థాయ్‌లాండ్ ప్రధాని షినవ్రత దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
News March 28, 2025
తెలుగువారే అగ్రస్థానంలో ఉండాలి: CM చంద్రబాబు

AP: భారతీయులు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని, వారిలోనూ తెలుగువారు ముందుండాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘తెలుగువారు దూసుకెళ్లాలనేది నా స్వార్థం. దీని కోసం అమరావతిలో క్వాంటమ్ వాలీని ప్లాన్ చేస్తున్నాం. అందులోనే అన్ని సాంకేతికతల్ని ఏర్పాటు చేస్తాం. భారత ప్రభుత్వంతో పాటు ఐఐటీ మద్రాస్, ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్‌టీతో కలిసి పనిచేస్తున్నాం. ఇలాంటిది తీసుకురావడం దేశంలోనే తొలిసారి’ అని వెల్లడించారు.