News March 20, 2025

వల్మీడి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన MLA

image

పాలకుర్తి మండలం వల్మీడి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను అధికారులతో కలిసి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆవిష్కరించారు. సీతారాముల కళ్యాణం ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని, వేలాది మంది భక్తులు హాజరయ్యే ఈ మహోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయం పరిసరాలను శుభ్రంగా ఉంచి,తాగునీరు, పారిశుధ్యం, తదితర అందుబాటులో ఉంచాలని సూచించారు.

Similar News

News October 21, 2025

చిత్తూరు: ఇకనైనా మైనింగ్ మాఫియాకి చెక్ పడేనా..?

image

చిత్తూరులో కొంత కాలంగా రాయల్టీ పైకానికి బ్రేక్ పడింది. రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ టెండర్ గత నెలాఖరుతో ముగిసింది. నేరుగా మైనింగ్ అధికారుల పర్యవేక్షణలో గ్రానైట్, గ్రావెల్ తరలింపు కొనసాగుతోంది. నూతన టెండర్ ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మరో 3 నెలలు రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి పొడిగిస్తారా..? లేక నూతన టెండర్ ఖరారు చేస్తారా? అనే అంశం మరి కొన్నిరోజుల్లో తేలనుంది.

News October 21, 2025

తిరుపతి: పోలీస్ అమరవీరులకు నివాళి

image

తిరుపతిలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు హాజరయ్యారు. అమరవీరులకు కలెక్టర్ నివాళులు అర్పించారు. రేపటి నుంచి అమరవీరుల కుటుంబాలను పరామర్శిస్తామని చెప్పారు. 24 నుంచి 27 వరకు విధ్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు.

News October 21, 2025

సంగారెడ్డి: ‘ఈనెల 25న దివ్యాంగుల జాతీయ సదస్సు’

image

దివ్యాంగుల- విద్య- ఉపాధి సంక్షేమం- సాధికారత అంశంపై ఈనెల 25న ఈనెల 25న దివ్యాంగుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కార్యదర్శి అడివయ్య మంగళవారం తెలిపారు. హైదరాబాద్‌లోని కమలా నగర్‌లో ఉన్న భాస్కరరావు భవన్‌లో 25న ఉదయం 11 గంటలకు జాతీయ సదస్సు జరుగుతుందని, దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.