News March 20, 2025

ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు…

image

∆} నేలకొండపల్లి:రైతు పొరపాటు.. ఐదెకరాలు ఎండిపోయింది!
∆}ఖమ్మం: అన్ని రంగాలకు కాంగ్రెస్ వెన్నుపోటు: ఎమ్మెల్సీ
∆}జూలూరుపాడు: నీటి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే
∆}చింతకాని: గుండెపోటుతో బీఆర్ఎస్ నేత మృతి
∆} ఖమ్మం:KCR నియంతలా వ్యవహరించారు: గుమ్మడి నరసయ్య
∆} ఖమ్మం:ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్
∆} పెనుబల్లిలో మంత్రి పొంగులేటికి ఘన స్వాగతం
∆}ట్రాక్టర్ బావిలో పడి ఒకరు దుర్మరణం

Similar News

News March 28, 2025

ఇల్లందు సింగరేణిలో పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్

image

ఇల్లందు సింగరేణి జేకే 5 ఓసీలో గురువారం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ జరిగింది. సినిమాలోని పలు సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. చిత్ర యూనిట్ సభ్యులతో సింగరేణి ప్రాంగణమంతా కోలాహలం నెలకొంది. సింగరేణి యాజమాన్యం షూటింగ్‌ను పర్యవేక్షించింది.

News March 28, 2025

నత్తనడకన LRS ఫీజు చెల్లింపు ప్రక్రియ

image

ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ముంచుకొస్తోంది. ఈ నెల 31తో రాయితీ గడువు ముగియనుంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 35వేల కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. జిల్లాలో 1,00,800 మంది దరఖాస్తు చేయగా 7,829 మంది మాత్రమే సొమ్ములు చెల్లించారు. దరఖాస్తులకు ఫీజు చెల్లింపు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుండడం గమనార్హం.

News March 28, 2025

భార్యను తీసుకురావడానికి వెళ్తూ.. భర్త మృతి

image

భార్యను ఇంటికి తీసుకురావడానికి బైక్ పై వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందిన ఘటన సత్తుపల్లి పట్టణం శివారులో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లికి చెందిన మట్ల వెంకటేశ్వరరావు (35) భార్య భవాని సత్తుపల్లిలోని జీవి మాల్‌లో పనిచేస్తుంది. ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు వస్తుండగా ఓ పానీపూరి బండిని ఢీకొట్టాడు. సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

error: Content is protected !!