News March 21, 2025

CMను కలిసిన అనంత దళిత ఎమ్మెల్యేలు

image

అమరావతిలో సీఎం చంద్రబాబును శింగనమల, మడకశిర ఎమ్మెల్యేలు బండారు శ్రావణి శ్రీ, ఎంఎస్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. దళితులందరికీ సమాన న్యాయం చేకూరాలనే ఉక్కు సంకల్పంతో చంద్రబాబు గతంలో చూపిన చొరవకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడానికి దళిత శాసనసభ్యులందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

Similar News

News March 28, 2025

నీ మొగుడి అలవాట్లే నీకు వచ్చాయి: తోపుదుర్తి

image

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రామగిరి ఎంపీపీ ఎన్నిక విషయంలో పరిటాల కుటుంబం ప్రజాసామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. ‘నీ మొగుడి అలవాట్లే నీకు, నీ కొడుకులకు వచ్చాయి. మీకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. టీడీపీకి కేవలం ఒక ఎంపీటీసీ స్థానం ఉన్నా దౌర్జన్యంతో ఎంపీపీ పీఠం చేజిక్కుంచుకోవాలని చూస్తున్నారు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

News March 28, 2025

తండ్రి మరణంలోనూ కుమార్తెకు ‘పరీక్ష’!

image

తండ్రి మరణంతో దుఃఖాన్ని దిగమింగుకుని పది పరీక్షలకు హాజరైంది ఓ విద్యార్థిని. ఉరవకొండ మం. రాకెట్లకు చెందిన రఘు(48) కూడేరు మండలం గొట్కూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రక్షిత పది పరీక్షలు రాస్తోంది. తన పెద్ద కుమార్తెను కాలేజీలో విడిచిపెట్టి తిరిగి బైక్‌పై వస్తుండగా ప్రమాదానికి గురై మృతి చెందారు. తండ్రి లేడన్న బాధను దిగమింగుకుని చిన్నకూతురు పరీక్ష రాసింది.

News March 28, 2025

వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా పెన్నోబులేసు

image

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా మాల్యావంతం పెన్నోబులేసును నియమించారు. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు జగన్మోహన్ రెడ్డికి, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

error: Content is protected !!