News March 21, 2025

ADB: ప్రజలు భగీరథ నీరు తాగాలి :కలెక్టర్

image

ADB జిల్లాలోని మారుమూల ప్రాంతాల గ్రామ ప్రజలు మిషన్ భగీరథ నీటిని తాగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ నీరు ప్రతి గ్రామానికి అందుబాటులో ఉందన్నారు. జిల్లా గ్రామస్థులు ఈ నీటిని సురక్షితంగా తాగవచ్చన్నారు. దీని ద్వారా వేసవిలో నీటి సమస్యలు రాకుండా ఉంటాయని పేర్కొన్నారు.

Similar News

News September 12, 2025

ఆదిలాబాద్ జిల్లా వర్షపాతం వివరాలు

image

గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా బేల మండలంలో 58 మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. నార్నూర్‌లో 48.3, భోరజ్ 47.8, భీంపూర్ 47.5, ఇంద్రవెల్లి 41.6, తలమడుగులో 41.3MM వర్షపాతం రికార్డయింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News September 12, 2025

ADB: కూలిన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం సాయంత్రం కూలిన పురాతన భవనాన్ని ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిశీలించారు. తహసిల్దార్ శ్రీనివాస్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని వారు తెలిపారు. నూతన కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని వారు చెప్పారు.

News September 11, 2025

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల

image

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయని ఆదిలాబాద్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సంగీత, వర్సిటీ ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ జాగ్రామ్ తెలిపారు. 2025 జూన్, జూలై నెలలో నిర్వహించిన డిగ్రీ 2వ సంవత్సరం, 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు పేర్కొన్నారు. https://online.braou.ac.in/UGResults/cbcsResults అనే వెబ్‌సైట్‌ను సందర్శించి ఫలితాలను చూసుకోవచ్చని సూచించారు.