News March 21, 2025
MNCL: జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలు: డీఈవో

మంచిర్యాల జిల్లాలో రేపటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను డీఈవో యాదయ్య సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 17, 2026
VKB: చీకట్లో వైద్యం.. ప్రభుత్వ ఆసుపత్రిలో అవస్థలు

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ సౌకర్యం లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్లూకోజ్, డెలివరీ గదుల్లో లైట్లు లేకపోవడంతో వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది. శనివారం కామునిపల్లి నుంచి వచ్చిన ప్రసవ కేసు విషయంలో లైట్లు లేక గర్భిణి పడ్డ అవస్థలు వర్ణనాతీతం. అత్యవసర సమయంలోనూ వెలుతురు లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News January 17, 2026
ఉద్యమ పార్టీగా ఎన్నో ఒడిదుడుకులు చూశాం: కొప్పుల

మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ధర్మపురిలో మాట్లాడుతూ.. అధికార పార్టీకి ధన బలం, అధికార బలం ఉంటే.. BRSకు ప్రజాబలం ఉందన్నారు. పార్టీ మారినవారి గురించి బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఒక ఉద్యమ పార్టీగా ఇలాంటి ఒడిదుడుకులు ఎన్నో చూశామని వ్యాఖ్యానించారు. KCR హయాంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు.
News January 17, 2026
ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ బదిలీ

ఉట్నూర్ అదనపు ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న కాజల్ సింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్‌ల బదిలీలు చేపడుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏఎస్పీ కాజల్ సింగ్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ 2 డీసీపీగా బదిలీ చేశారు. కొంత కాలంగా ఉట్నూర్ ఏఎస్పీగా ఉన్న ఆమె పలు కేసుల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించారు.


