News March 21, 2025
రాబోయే 4 సం.రాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి

ఖమ్మం: రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 4 లక్షల 50 వేల ఇండ్ల నిర్మాణం చేపట్టి, రాబోయే 4 సం.లలో 20 లక్షల వరకు ఇందిరమ్మ ఇండ్లను కట్టే దిశగా ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం మంత్రి పెనుబల్లి, కల్లూరు మండలాల్లో పర్యటించి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి ఇందిరమ్మ ఇళ్లకు, CC రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు.
Similar News
News March 28, 2025
ఇల్లందు సింగరేణిలో పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్

ఇల్లందు సింగరేణి జేకే 5 ఓసీలో గురువారం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ జరిగింది. సినిమాలోని పలు సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. చిత్ర యూనిట్ సభ్యులతో సింగరేణి ప్రాంగణమంతా కోలాహలం నెలకొంది. సింగరేణి యాజమాన్యం షూటింగ్‌ను పర్యవేక్షించింది.
News March 28, 2025
నత్తనడకన LRS ఫీజు చెల్లింపు ప్రక్రియ

ఎల్ఆర్ఎస్ ఫీజుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ముంచుకొస్తోంది. ఈ నెల 31తో రాయితీ గడువు ముగియనుంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 35వేల కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. జిల్లాలో 1,00,800 మంది దరఖాస్తు చేయగా 7,829 మంది మాత్రమే సొమ్ములు చెల్లించారు. దరఖాస్తులకు ఫీజు చెల్లింపు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుండడం గమనార్హం.
News March 28, 2025
భార్యను తీసుకురావడానికి వెళ్తూ.. భర్త మృతి

భార్యను ఇంటికి తీసుకురావడానికి బైక్ పై వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందిన ఘటన సత్తుపల్లి పట్టణం శివారులో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లికి చెందిన మట్ల వెంకటేశ్వరరావు (35) భార్య భవాని సత్తుపల్లిలోని జీవి మాల్లో పనిచేస్తుంది. ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు వస్తుండగా ఓ పానీపూరి బండిని ఢీకొట్టాడు. సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.