News March 21, 2025
MNCL: స్కాలర్షిప్.. APPLY NOW

2025 సంవత్సరంలో ఎస్సీ విద్యార్థుల ఉన్నత చదువులకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం డిగ్రీ పూర్తయినా లేదా చివరి ఏడాది చదువుతున్న వారు మే 19లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకు https://telanganaepass.cgg.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Similar News
News July 6, 2025
పోలీసు శాఖలో 2, 844 కేసులు రాజీ: ఎస్పీ

ఏలూరు జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌లో పోలీస్ శాఖకు సంబంధించిన 2,844 కేసులు రాజీ అయ్యాయని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. 827 IPC కేసులు, 417 స్పెషల్ అండ్ లోకల్ లాస్ కేసులు, 143 ఎక్సైజ్ కేసులు, 1, 454 పెట్టీ కేసులు (చిన్నపాటి చట్టపరమైన నేరాలు)తో మొత్తం 2, 844 కేసులు రాజీ అయ్యాయన్నారు.
News July 6, 2025
WGL: రేపు వరంగల్ మార్కెట్ ప్రారంభం

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున:ప్రారంభం కానుంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో సోమవారం ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులకు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
News July 6, 2025
ఆ చిన్నారే ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ..

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ ఫస్ట్ <<16964615>>గ్లింప్స్<<>> తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా సారా అర్జున్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈమె ఎవరో కాదు చియాన్ విక్రమ్ ‘నాన్న’ సినిమాలో నటించిన చిన్నారి. బాలనటిగా పలు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. దీంతో పాటు యాడ్స్‌లోనూ మెరిశారు. హీరోయిన్‌గా తొలి సినిమానే స్టార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేశారు. ఆమె నాన్న రాజ్ అర్జున్ కూడా నటుడే.