News March 21, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News March 22, 2025

IPL 2025: విజేత ఎవరో?

image

మెగావేలం తర్వాత జరిగే ఈ సీజన్‌లో 10 జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. మరి ఈ సీజన్‌లో కింది విభాగాల్లో ఎవరు సత్తా చాటుతారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
* సీజన్ విజేత
* రన్నరప్
* ఆరెంజ్ క్యాప్
* పర్పుల్ క్యాప్
* అత్యధిక సిక్సర్లు
* అత్యధిక శతకాలు
* అత్యధిక పరుగులు
* అత్యధిక వికెట్లు

News March 22, 2025

ఆరో తరం ఫైటర్ జెట్‌పై అమెరికా చూపు

image

ఓవైపు ప్రపంచదేశాలు ఐదో తరం ఫైటర్ జెట్‌ గురించి ఆలోచిస్తుంటే అమెరికా ఆరో తరంపై దృష్టి సారించింది. అత్యాధునిక యుద్ధవిమానాన్ని రూపొందించే బాధ్యతను ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ బోయింగ్‌కు అప్పగించారు. ‘ప్రపంచంలో మరే విమానం కూడా దరిదాపుల్లోకి రాని విధంగా మా ఫైటర్ జెట్ ఉంటుంది. దాన్ని ఎఫ్-47గా పిలుస్తున్నాం. ఇప్పటికే ఐదేళ్లుగా దాని ప్రయోగాత్మక వెర్షన్‌ను రహస్యంగా పరీక్షిస్తున్నాం’ అని వెల్లడించారు.

News March 22, 2025

BREAKING: దిగ్గజ బాక్సర్ కన్నుమూత

image

ప్రముఖ బాక్సింగ్ దిగ్గజం జార్జ్ ఫోర్‌మెన్(76) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1968 ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్‌ గెలవడంతో పాటు రెండు సార్లు హెవీ వెయిట్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచారు. తన కెరీర్లో 68 నాకౌట్లలో పాల్గొనగా ఐదింట్లో మాత్రమే ఓటమి పాలయ్యారు. 1997లో బాక్సింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రముఖ బాక్సర్ మహమ్మద్ అలీతో 1974లో జరిగిన పోరులో ఓటమి పాలయ్యారు.

error: Content is protected !!