News March 21, 2025
అమరావతి చిత్ర కళా వీధి పోస్టర్ ఆవిష్కరించిన పవన్

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి చిత్ర కళా వీధి పోస్టర్‌ను ఆవిష్కరించారు. గురువారం ఆయన విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక కమిషన్ చైర్‌పర్సన్ తేజస్వి పొడపాటితో కలిసి ఈ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ ప్రత్యేకమైన కళా ఉత్సవం ఆంధ్రప్రదేశ్‌లోని కళాకారులందరికీ ఒక ఆశాకిరణంలా నిలుస్తుందని పేర్కొన్నారు.
Similar News
News November 11, 2025
MBNR: సౌత్ జోన్.. 27న వాలీబాల్ ఎంపికలు

పాలమూరు వర్సిటీ నుంచి సౌత్ జోన్ ఆలిండియా వర్సిటీలో పాల్గొనేందుకు వాలీబాల్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ PD డా.వై. శ్రీనివాసులు ‘Way2News’తో తెలిపారు. ఈనెల 27న వాలీబాల్(పురుషుల) జట్ల ఎంపికలు ఉంటాయని, వయస్సు 17-25లోగా ఉండాలన్నారు. ప్రస్తుతం చదువుతున్న క్రీడాకారులు బోనఫైడ్, టెన్త్ మెమో(కాలేజీ యొక్క ప్రిన్సిపల్ సంతకం)తో పాటు క్రీడా దుస్తులు ధరించి రావాలని, 26లోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
News November 11, 2025
రేపు అన్నమయ్య జిల్లాకు CM చంద్రబాబు

అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లి పర్యటనలో భాగంగా రేపు ఉదయం 9:10 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 10:40 నిమిషాలకు చిన్నమండెం చేరుకోనున్నారు. ప్రభుత్వ పక్కా గృహాల్లో గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొని తిరిగి సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు బయలుదేరి విశాఖపట్నం వెళ్లనున్నారు.
News November 11, 2025
కురుమూర్తి స్వామి హుండీ లెక్కింపు రూ.79.68 లక్షల ఆదాయం

మహబూబ్‌నగర్ జిల్లా అమ్మాపురం శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంలో 2024 బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం మూడు హుండీల లెక్కింపు జరిగింది. నగదు రూపంలో మొత్తం రూ.79,68,810 ఆదాయం సమకూరినట్లు పాలక మండలి చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, కార్యనిర్వాహణాధికారి మదనేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇందులో మొదటి హుండీలో రూ.25,54,805, రెండో హుండీలో రూ.22,78,894, మూడో హుండీలో రూ.31,35,111 గా ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.


