News March 21, 2025

మంచినీటి సమస్యాత్మక గ్రామాలను గుర్తించాలి: కలెక్టర్

image

జిల్లాలో వారంలోగా మంచినీటి సమస్యాత్మక గ్రామాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గురువారం వేసవిలో తాగునీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో ఆయా గ్రామాలలో తాగునీటి సమస్య రాకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు. మండలస్థాయి అధికారులు తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

Similar News

News January 8, 2026

నేడు ఈ వస్తువులు దానం చేస్తే అదృష్టం

image

విష్ణువుకు ఇష్టమైన గురువారం నాడు పసుపు రంగు వస్తువులు దానమిస్తే జాతకంలో బృహస్పతి దోషాలు తొలగి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని నమ్మకం. పేదలకు పసుపు వస్త్రాలు, పప్పు ధాన్యాలు, అరటిపండ్లు, పసుపు మిఠాయిలను దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు. దీనివల్ల వృత్తిలో పురోగతి లభించడమే కాకుండా, ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయని అంటున్నారు. స్తోమతను బట్టి చేసే దానం, విష్ణుమూర్తి కృపతో శుభాలను చేకూరుస్తుంది.

News January 8, 2026

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం

image

దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను జనవరి 17న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. గువాహటి-కోల్‌కతా రూట్‌లో 18 నుంచి పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయి. 16 కోచ్‌లు, 823 సీట్లు కలిగిన ఈ ట్రైన్‌లో విమాన తరహా సౌకర్యాలు, ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. మధ్యతరగతి ప్రయాణికుల కోసం టికెట్ ధరలు రూ.2,300-3,600 మధ్య నిర్ణయించారు. గంటకు 180 KM వేగంతో దూసుకెళ్లనుంది.

News January 8, 2026

శకటాలను అందంగా తయారుచేయండి: జేసీ

image

నెల్లూరులో రిప్లబిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల పరిశుభ్రతతో పాటు భద్రతకు ప్రాధాన్యమివ్వాలని పోలీస్ శాఖకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలిపే శకటాలను అందంగా, విజ్ఞానదాయకంగా తయారుచేసి ప్రదర్శించాలని కోరారు.