News March 21, 2025

అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

కాళేశ్వరం సరస్వతి పుష్కరాల గురించి మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో చర్చించారు. ఆయన మాట్లాడుతూ.. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించారు. నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం నాణ్యత పాటిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి, పుష్కరాల సమయానికి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.

Similar News

News September 14, 2025

సంగీత దర్శకుడు శ్రీ మన గుంటూరు జిల్లా వారే

image

సంగీత దర్శకుడు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి (శ్రీ) గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో 1966, సెప్టెంబర్ 13న జన్మించారు. ఈయన సంగీత దర్శకుడు కె. చక్రవర్తి 2వ కుమారుడు. 1993లో గాయం సినిమా శ్రీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. ఇందులో సిరివెన్నెల రాసిన
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అనే గీతం ఒక ఆణిముత్యం. సింధూరం చిత్రం ఆయన కెరీర్‌లో మరో పెద్ద విజయం.

News September 14, 2025

HYD: రోడ్డుపై చెత్త వేస్తే 8 రోజుల జైలు శిక్ష

image

చెత్తపై స్పెషల్ డ్రైవ్ నేపథ్యంలో HYD పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డ మీద చెత్త వేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు మీద చెత్త వేసే చట్టంలోని సెక్షన్‌ ప్రకరాం 8 రోజులు జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు. బోరబండ పోలీసులు 2 రోజుల్లో రోడ్లపై చెత్త వేపిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి మీద ఛార్జిషీటు దాఖలు చేసి న్యాయమూర్తి ముందు హజరుపరచగా రూ.1000 ఫైన్ వేశారు.

News September 14, 2025

గజ్వేల్‌లో ఒకే కాలనీకి ఆరు పేర్లు

image

గజ్వేల్ పట్టణంలోని ఓ కాలనీకి ఆరు పేర్లు ఉండడం చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న ఈ కాలనీని గతంలో వినాయకనగర్ కాలనీ, రెడ్డి కాలనీ అని పిలిచేవారు. తాజాగా ముదిరాజ్, యాదవ్, విశ్వకర్మ, ఆర్యవైశ్య కాలనీలుగా బోర్డులు పెట్టడంతో ఈ కాలనీకి ఒకేసారి ఆరు పేర్లు వచ్చాయి. ఒకే కాలనీకి ఇన్ని పేర్లు ఉండడం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.