News March 21, 2025
దాడి కేసులో ఇద్దరికి రిమాండ్: వాంకిడి ఎస్సై

వాంకిడి మండలంలోని ఓ బిర్యాణి హోటల్ యజమానిపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించినట్లు ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం..ఈ నెల 18న వాంకిడిలోని ఓ బిర్యానీ హోటల్లో రవిచంద్ర కాలనీకి చెందిన కొండ సంతోష్, పస్తం ఇషాక్ మద్యం మత్తులో బిర్యానీ తినడానికి వెళ్లారు. ఈ క్రమంలో హోటల్ యజమానితో గొడవకు దిగి దాడి చేశారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Similar News
News March 28, 2025
జిన్నారం: ట్రాక్టర్ చక్రం కిందపడి బాలుడి మృతి

ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతిచెందిన ఘటన బొల్లారం PS పరిధిలో గురువారం చోటుచేసుకుంది. జిన్నారం మం. మాదారంలో ట్రాక్టర్ డ్రైవర్ గంగారం.. సందీప్(12)ను ట్రాక్టర్ ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో బాలుడు జారి కింద పడగా ట్రాక్టర్ వెనకాల చక్రం బాలుడిపైకి ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే బాలుడు మృతిచెందినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. గంగారంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 28, 2025
MHBD: పురుగు మందు తాగి వ్యక్తి మృతి

పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన MHBD ఈదులపూసపల్లి శివారు శీతల తండా పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఈర్య తండాకు చెందిన బానోత్ రవి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడని తెలిపారు.
News March 28, 2025
జీకేవీధిలో జ్వరంతో యువకుడు మృతి

జీకేవీధిలోని అగ్రహారంలో జ్వరంలో గురువారం శివకుమార్ (26) మృతి చెందాడు. గ్రామంలో గత కొద్ది రోజులుగా జ్వరాలు విజృంభిస్తున్నాయని మరో పది బాధపడుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. కాగా మృతుడు నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుండగా.. ప్రైవేటు వైద్యుని వద్దచికిత్స తీసుకున్నాడు. పరిస్థితి విషమించి గురువారం చనిపోయాడు. వారి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.