News March 21, 2025
నిర్మల్: ‘9059987730 నంబర్‌కు కాల్ చేయండి’

జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణలో సందేహాలపై అధికారులు హెల్ప్ లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవరికైనా పరీక్షల నిర్వహణపై ఎటువంటి సమాచారం కావాలన్నా, సందేహాలున్నా 9059987730 నంబరును సంప్రదించవచ్చని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. పదో తరగతి పరీక్షలపై ఎటువంటి అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేసిన చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
Similar News
News March 28, 2025
VKB: “షబ్ -ఏ -ఖదర్” వేడుకలు

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా “షబ్ -ఏ -ఖదర్” వేడుకలు రాత్రి భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముస్లింలు మసీదులను రంగులు, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేసి, రాత్రంతా మసీదుల్లోనే జాగరణ చేస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అన్ని మసీదుల్లోను రాత్రి జాగరణ కోసం ఏర్పాట్లు చేశారు. తరవీహ్ నమాజ్ అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం మత పెద్దలను ఘనంగా సన్మానించారు.
News March 28, 2025
కొవ్వూరు: ప్రభాకర్ మర్డర్ కేసులో వీడని మిస్టరీ..

కొవ్వూరు మండలం దొమ్మేరులో గురువారం జరిగిన పి.ప్రభాకర్ మర్డర్ కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. ఆయుర్వేదం షాప్ నడుపుతున్న ఆయనకు బుధవారం రాత్రి ఫోన్ కాల్ రావడంతో బయటికి వెళ్లి పొలంలో విగతజీవిగా మారాడు. దుండగులు అతడిపై కత్తితో దాడి చేసి కుడి చేతిని నరికి హస్తాన్ని తీసుకుపోయారు. సీసీ ఫుటేజ్, చివరి ఫోన్ కాల్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఏఎస్పీ సుబ్బరాజు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరుగుతోంది.
News March 28, 2025
VZM: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ఎస్.కోట మండలం కొత్తూరు సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బసనబోయిన కార్తీక్ (21) మృతి చెందాడు. ఇతను తన స్నేహితులతో కలసి ఎస్.కోట నుంచి స్కూటీపై ఎల్.కోట పండక్కి వెళ్తున్న నేపథ్యంలో కొత్తూరు సమీపంలో ఎదురుగా వస్తున్న బైకు ఢీకొట్టింది. స్కూటీపై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఎస్.కోట పీహెచ్సీకి తరలించగా కార్తీక్ మృతి చెందినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు.