News March 21, 2025

గద్వాల: సుంకేసుల డ్యామ్‌ను పరిశీలించిన కలెక్టర్

image

తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని, ప్రాజెక్టు పనితీరును జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ గురువారం పరిశీలించారు. అనంతరం రాజోలి గ్రామ సమీపాన ఉన్న సుంకేసుల బ్యారేజిని సందర్శించి, నీటి నిల్వ సామర్థ్యంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో.. తహశీల్దార్ రామ్మోహన్, ఎస్ఐ జగదీశ్వర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దస్తగిరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 3, 2025

జిల్లాలో సాధారణంగానే చలి తీవ్రత

image

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత సాధారణంగానే ఉంది. గడిచిన 24 గంటల్లో గొల్లపల్లిలో 22.6℃, మన్నెగూడెం 22.8, పెగడపల్లె 22.9, కోరుట్ల 23.0, కథలాపూర్, గోవిందారం 23.1, రాఘవపేట, జగ్గసాగర్, తిరుమలాపూర్ 23.2, రాయికల్, ఐలాపూర్, గోదూరు 23.3, కొల్వాయి, పూడూర్, పొలాస 23.4, బుద్దేశ్‌పల్లి, మేడిపల్లె, మల్యాల, జగిత్యాల 23.5, మల్లాపూర్లో 23.7℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో చలి తీవ్రత తక్కువగానే ఉంది.

News November 3, 2025

వనపర్తి జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్: ఎస్పీ

image

వనపర్తి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఈనెల 30 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించే సమావేశాలు పూర్తిగా నిషేధించామని చెప్పారు.

News November 3, 2025

వనపర్తి: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి

image

విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని డివిజనల్ ఇంజినీర్ కార్యాలయంలో TGSPDCL ఎస్‌ఈ రాజశేఖరమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలోని వినియోగదారుల నుంచి 18 ఫిర్యాదులను స్వీకరించారు. పాడైన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ మీటర్ బిల్లులు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ సమస్యలపై వినియోగదాల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. డీఈ. శ్రీనివాస్, వెంకటేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు.