News March 21, 2025

నారాయణపేట జిల్లా ఎస్పీ WARNING

image

నేటి నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి పరీక్షకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. మొత్తం 39 పరీక్ష కేంద్రాల్లో 7,631 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, గుంపులుగా ఎవరూ తిరగవద్దని హెచ్చరించారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించొద్దని సూచించారు.

Similar News

News January 4, 2026

కామారెడ్డి జిల్లాలో మళ్లీ పెరుగుతున్న చలి ప్రభావం

image

కామారెడ్డి జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను అధికారులు వెల్లడించారు. లచ్చపేట 13°C, గాంధారి 13.9, దోమకొండ 14, ఎల్పుగొండ 14.3, ఇసాయిపేట 14.5, భిక్కనూరు 14.7, జుక్కల్ 14.9°C ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ఆధారంగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 2 రోజులుగా పొగమంచు అధికంగా ఏర్పడి, చలి తగ్గగా, తిరిగి చలి ప్రభావం ఎక్కువవుతుందని తెలిపారు.

News January 4, 2026

కురుపాం: చికిత్స పొందుతూ యువకుడు మృతి

image

కురుపాం(M) పి.లేవిడి గ్రామానికి చెందిన వి.అజిత్ కుమార్ (23) గత నాలుగు రోజులుగా కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు.స్థానికుల వివరాలు మేరకు..గత నెల 31న గుమ్మలక్ష్మీపురం(M)బొద్దిడి సమీపంలో గ్యాస్ వ్యాన్‌ను బైక్ ఢీకొని ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో అజిత్ కుమార్‌కు తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి కుటుంబీకులు తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మరణించాడు.

News January 4, 2026

కూరగాయల పంట పెరిగింది: మాధవి

image

ఉద్యానశాఖ చేపట్టిన చర్యల వల్ల గతేడాది సీజన్ 767 ఎకరాలుగా ఉన్న కూరగాయల విస్తీర్ణం ఈ ఏడాదిలో 1,458 ఎకరాలకు పెరిగిందని జిల్లా ఉద్యానవన అధికారి మాధవి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో కూరగాయల సాగు చేసే రైతులు 1,710 మంది వరకు ఉన్నారన్నారు. కూరగాయల సాగు కోసం మల్చింగ్ షీట్ వేసిన రైతులకు ఎకరానికి రూ.8వేలు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు.