News March 21, 2025

మహబూబాబాద్: చిన్నారిపై వీధి కుక్కల దాడి

image

వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దవంగర మండల కేంద్రంలో గురువారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాలు.. వెన్నెల-మహేశ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు నందిని అంగన్వాడీ నుంచి తమ బంధువుల ఇంటికి వెళ్తున్న క్రమంలో వీధి కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. ఈ దాడిలో ఆమె ముఖం, తలకు తీవ్ర గాయాలు కావడంతో 108లో ఎంజీఎంకు తరలించారు.

Similar News

News October 31, 2025

దంపతుల గల్లంతు.. మృతదేహాలు లభ్యం

image

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి వాగులో వరద ప్రవాహానికి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లికి చెందిన <<18150389>>దంపతులు<<>> ఈసంపల్లి ప్రణయ్(28), కల్పన(24) గల్లంతైన విషయం తెలిసిందే. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు ఇవాళ ఉదయం దంపతుల మృతదేహాలను గుర్తించారు. కాగా, ప్రణయ్, కల్పనను విగతజీవులుగా చూసిన బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

News October 31, 2025

‘మొంథా’ తుపాను నష్టంపై నివేదిక: డీఏవో

image

మొంథా తుపాను కారణంగా మహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్న పంటల ప్రాథమిక నష్టం నివేదికను ప్రభుత్వానికి పంపించామని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు సేకరించిన వివరాల ప్రకారం.. జిల్లాలో మొత్తం 16,617 ఎకరాల్లో వరి, 8,782 ఎకరాల్లో పత్తి, 565 ఎకరాల్లో మిర్చి, 65 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టపోయినట్లు నివేదిక రూపొందించామని పేర్కొన్నారు.

News October 31, 2025

NLG: రూ.కోట్లల్లో పేరుకుపోయిన బకాయిలు

image

బకాయిల వసూళ్ల విషయంలో నల్గొండ మున్సిపల్ రెవెన్యూ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. రూ.కోట్లలో రావాల్సి ఉన్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా పనిచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో ఈ ఏడాది ఆస్తి పన్ను రూ.9.30 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇకపోతే పాత బకాయిలు రూ. 33.80 కోట్లు ఉన్నాయి. మొత్తంగా రూ.43.11 కోట్లు ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి.