News March 21, 2025

పెబ్బేరులో రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కేసు నమోదు: ఎస్ఐ 

image

అక్రమాలకు పాల్పడుతూ అమాయకుల నుంచి రూ.లక్షలు దోచుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు గోనేల ఎల్లయ్య, బొడ్డుపల్లి రాజు అనే వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పెబ్బేరు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి గురువారం తెలిపారు. సర్వే నంబర్‌పై తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వారు ప్లాట్లు విక్రయించారని గద్వాల్‌కు చెందిన కళ్యాణ్ కుమార్ ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News January 12, 2026

తిరుపతి: శిల్ప కళాశాల నిర్మాణం ప్రత్యేకం..!

image

అలిపిరి వద్ద టౌన్ షిప్ నిర్మించాలంటే శిల్ప కళాశాలను తొలగించాలనే వాదన నడుస్తోంది. 1960లో శిల్ప కళ అంతరించిపోకుండా ఉండేందుకు TTD దీన్ని ఏర్పాటు చేసింది. విద్యార్థుల సౌకర్యాలు, విగ్రహాల తయారీ, వాటి ప్రదర్శన తదితర అవసరాలకు తగిన విధంగా ఏర్పాటు చేసింది. ఆభవనం తొలగించాలంటే ఆహంగులతో తిరిగి నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుంది, అంత నష్టం అవసరమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. TTD స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

News January 12, 2026

విజయ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం

image

కరూర్ తొక్కిసలాటపై TVK చీఫ్ విజయ్‌పై CBI ప్రశ్నల వర్షం కురిపించింది. ‘బహిరంగ సభకు ఆలస్యంగా ఎందుకు వచ్చారు? రాజకీయశక్తిని ప్రదర్శించడం కోసమే అలా చేశారా? జనసమూహంలో కారు నుంచి ఎందుకు బయటకు వచ్చారు? సభలో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా మీరెందుకు ప్రసంగం కొనసాగించారు? నీళ్ల బాటిళ్లను ఎందుకు పంపిణీ చేశారు?’ అని ప్రశ్నించింది. ర్యాలీకి ముందు పార్టీ నేతలతో సమావేశాలపైనా ఆరా తీసింది.

News January 12, 2026

సంక్రాంతి.. HYD దాటిన 7 లక్షల వాహనాలు

image

సంక్రాంతి వేళ HYD నుంచి స్వగ్రామాలకు జనం క్యూ కట్టారు. ఈ సారి 12 లక్షల వాహనాలు HYD దాటనున్నట్లు అంచనా వేయగా.. ఇప్పటికే సుమారు 7 లక్షల వాహనాలు HYD దాటినట్లు వివిధ శాఖల అధికారులు తెలిపారు. ప్రతి 20 కిలోమీటర్లకు అంబులెన్స్, ఆగిన వాహనాల తరలింపునకు క్రేన్లు, భద్రత కోసం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. టోల్ గేట్ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు ఉన్నాయి.