News March 24, 2024
ఏడుపాయలలో కనుల పండువగా దుర్గమ్మ పల్లకి సేవ

ఏడుపాయల వన దుర్గమ్మ సన్నిధిలో పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి సేవ కనుల పండువగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో ఏర్పాటుచేసిన ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఆలయం నుండి ప్రారంభమైన పల్లకిసేవ శివాలయం మీదుగా కొనసాగి రాజగోపురం గుండా ఆలయం వరకు చేరుకోగా పల్లకి సేవలో పాల్గొని భక్తులు తరించిపోయారు.
Similar News
News March 8, 2026
మెదక్: 4 పురపాలికల ప్రథమ పౌరులు మహిళలే..!

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు మహిళలే ప్రథమ పౌరులుగా ఎన్నికై రికార్డు సృష్టించారు. మెదక్‌లో కానుగు రాధిక, రామాయంపేటలో లావణ్య, తూప్రాన్‌లో రాజమణి, నర్సాపూర్‌లో లక్ష్మి మున్సిపల్ ఛైర్‌పర్సన్లుగా బాధ్యతలు చేపట్టారు. రిజర్వేషన్లు కలిసి రావడంతో నలుగురు మహిళా నేతలే పాలనా పగ్గాలు చేపట్టడం విశేషం. తమదైన ముద్ర వేస్తూ పట్టణాల అభివృద్ధికి కృషి చేస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
News March 7, 2026
MDK: యువతే దేశ భవిష్యత్: అదనపు ఎస్పీ

మెదక్ జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2026 జిల్లా స్థాయి పోటీలలో అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. “50 Years of Emergency – Lessons for Indian Democracy” అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో యువతే దేశ భవిష్యత్ అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
News March 7, 2026
పోలీసులు భాగస్వాములు కావాలి: మెదక్ అదనపు ఎస్పీ

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో పోలీసులు భాగస్వాములు కావాలని అదనపు ఎస్పీ మహేందర్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 13 నుంచి 18 వరకు సురక్షితంగా చేరుకోండి (Arrive Alive) కార్యక్రమం హోం, రవాణా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన, ట్రాఫిక్ నియమాల అమలు, హెల్మెట్‌పై అవగాహన కల్పించాలని సూచించారు.


