News March 21, 2025
స్టేషన్ ఘనపూర్‌లో మరోసారి బయటపడ్డ కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు

స్టే.ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. గురువారం ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్ ఆమోదం పొందడంతో సింగపురం ఇందిర వర్గానికి చెందన కాంగ్రెస్ రాష్ట్రమహిళా అధ్యక్షురాలు మౌనిక, మండల అధ్యక్షురాలు పద్మలు సీఎంతో పాటు పలువురి చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. ఈ ఫ్లెక్సీపై స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య ఫొటో లేకపోవడంతో మండలంలో చర్చనీయాంశమైంది.
Similar News
News January 14, 2026
వేరుశనగలో దిగుబడి పెరగాలంటే!

వేరుశనగలో పంట నాణ్యత, దిగుబడి పెరగడానికి జింక్ చాలా కీలకం. ఈ సూక్ష్మపోషకం తగ్గినప్పుడు మొక్కలో ఎదుగుదల ఉండదు. ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఈనెలకు ఇరువైపులా తుప్పురంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని వారం వ్యవధిలో 2-3సార్లు పిచికారీ చేయాలి. ఎకరాకు 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్‌ను 3 పంటలకొకసారి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.
News January 14, 2026
ఏలూరులో సంక్రాంతి వేడుకల్లో ఎడ్ల బండిపై ఎస్పీ దంపతులు

ఏలూరులో పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణలో సంక్రాంతి సంబరాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ ప్రతాప శివ కిషోర్, ఆయన సతీమణి ధాత్రి రెడ్డి (రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో) దంపతులు సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి, చిన్నారులకు భోగి పళ్లు పోశారు. అనంతరం పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఎడ్లబండిపై విహరించి అందరినీ అలరించారు. ఈ వేడుకల్లో పోలీసు కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి.
News January 14, 2026
గిల్ మినహా టాపార్డర్ విఫలం

న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత టాపార్డర్ విఫలమైంది. కెప్టెన్ గిల్(56) మినహా రోహిత్(24), కోహ్లీ(23), అయ్యర్(8) నిరాశపర్చారు. ఓపెనింగ్ జోడీ తొలి వికెట్‌కు 70 పరుగులు నమోదు చేసింది. 99 రన్స్ వద్ద రెండో వికెట్ కోల్పోగా 19 పరుగుల వ్యవధిలోనే 3 కీలక వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. NZ బౌలర్ క్లర్క్ 3 వికెట్లతో చెలరేగారు. 26 ఓవర్లో భారత్ స్కోరు 125-4.


