News March 21, 2025
వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలపై MLA సమీక్ష

జనగామ జిల్లా పాలకుర్తి మండలం వాల్మీడి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా జరగబోయే బ్రహ్మోత్సవాలకు తగిన ఏర్పాట్లను సమీక్షించేందుకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ అధికారులు, రెవెన్యూ, పోలీస్, గ్రామపంచాయతీ, విద్యుత్, ఆరోగ్య శాఖల అధికారులు, భక్తులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News November 28, 2025
హనుమాన్ చాలీసా భావం – 23

ఆపన తేజ సమ్హారో ఆపై|
తీనోం లోక హాంక తే కాంపై||
హనుమంతుడి తేజస్సు ఎంత శక్తిమంతమైనదంటే.. దానిని కేవలం ఆయనే మాత్రమే స్వయంగా నియంత్రించుకోగలడు. ఆయన పెట్టే ఒక్క కేకకు 3 లోకాలు సైతం భయంతో కంపించిపోతాయి. లోకాలను శాసించగల మహాశక్తిని కలిగిన ఆంజనేయుడు శాంతి స్వరూపుడు కూడా! ఆ అపారమైన శక్తిని మనం పూజించినా, కాపాడమని శరణు వేడినా.. తప్పక రక్షిస్తాడు. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 28, 2025
ఆదిలాబాద్: సంతానం కలగడం లేదని వ్యక్తి SUICIDE

మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉట్నూర్ మండలంలో బుధవారం జరిగింది. SI ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగాపూర్‌కు చెందిన సయ్యద్ యూసుఫ్(58)కు సంతానం కలగడం లేదని మనస్తాపం చెందాడు. దీంతో మద్యానికి బానిసయ్యాడు. బుధవారం మద్యం మత్తులో ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన భార్య భాను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News November 28, 2025
APPLY NOW: NCPORలో ఉద్యోగాలు

నేషనల్ సెంటర్ ఫర్ పోలార్&ఓషియన్ రీసెర్చ్(NCPOR) 5 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. జీతం నెలకు రూ.56వేలు+HRA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ncpor.res.in/


