News March 21, 2025
SRD: ‘విదేశీ విద్య పథకానికి దరఖాస్తుల ఆహ్వానం’

అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుంచి అంబేడ్కర్ విద్యానిధి పథకం కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి గురువారం తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను http://telanganaepass.cgg.gov.inలో మే 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేందుకు రూ.20 లక్షల సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. SHARE IT..
Similar News
News November 4, 2025
ఉమ్మడి మెదక్ జిల్లా ఖోఖో జట్ల ఎంపిక

తూప్రాన్ గురుకులంలో రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ జట్లను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు హరికిషన్, శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 150 మంది హాజరు కాగా, 15 మంది పురుషులు, 15 మంది మహిళలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈనెల 6 నుంచి పెద్దపల్లిలో రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని వివరించారు.
News November 4, 2025
విశాఖ: మనస్తాపంతో CA విద్యార్థి ఆత్మహత్య

సీఏ చదువుతున్న విద్యార్థి విశాఖలో ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ సీఐ ఎర్రంనాయుడి వివరాల ప్రకారం.. CA విద్యార్థి అఖిల్ వెంకట వంశీ ఆరిలోవలో నివాసం ఉంటున్నాడు. అన్ని పరీక్షలు పాస్ అయినట్లు ఇంట్లో అబద్దం చెప్పినందుకు మనస్తాపం చెందాడు. దీంతో పరీక్షల నిమిత్తం కొబ్బరి తోటలో తీసుకున్న రూమ్ వద్దే మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
News November 4, 2025
MHBD: బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలి: కలెక్టర్

అన్ని రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై సమావేశం నిర్వహించారు.
ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు జిల్లాలోని డోర్నకల్ పరిధిలో 267, MHBD పరిధిలో ఉన్న 288, పోలింగ్ కేంద్రాలలో కేంద్రానికి ఇద్దరు చొప్పున అన్ని రాజకీయ పార్టీల బూతు లెవెల్ ఏజెంట్లను నియమించాలన్నారు.


